యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యారు.ఈ సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.
అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాదే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో నిరాశకు గురి చేశాయి.ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల సైతం ఈయన నటిస్తున్న తదుపరి సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇందులో ప్రభాస్ సరసన మొదటిసారిగా శృతిహాసన్ సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమాని కూడా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే ఫిల్మ్ నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ బిగ్ అప్డేట్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.
ప్రభాస్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఇలా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.ఇందులో ప్రభాస్ చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు.ఇలా ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇవ్వడమే కాకుండా ప్రభాస్ పోస్టర్ విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే.ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.