ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ దాని కోసం ఏం చేయాలనే విషయంపై దృష్టి పెట్టింది.ఈ నెల 21 22 తేదీల్లో కీలక సమావేశం నిర్వహిస్తోంది.
ఆ సమావేశంలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమించాలని చూస్తోంది.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
మళ్ళీ బిజెపి ఛాన్స్ ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.దీంతో కాంగ్రెస్ లో మరింత ఆందోళన పెరిగింది.
అందుకే దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలకు దగ్గర అవ్వాలని, ఆ పార్టీల మద్దతుతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నారు.దీనిలో భాగంగానే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఉన్నారట.
ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని , కుదరని పక్షంలో టిడిపికి బయటి నుంచి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలి అనేది రాహుల్ గాంధీ ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది.గతంలో తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి.18 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.ఏపీలో ను ఇదే తరహాలో పొత్తు పెట్టుకోవాలని, పొత్తు కుదరక పోయినా తెలుగుదేశం పార్టీ మద్దతు కూడగట్టాలని, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మంచి ప్రాధాన్యం ఇస్తామని, ప్రభుత్వం లోకి తీసుకుంటామని ఆఫర్లు కూడా రాహుల్ నుంచి వస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే బీజేపీ నేతల నుంచి సరైన రెస్పాన్స్ కనిపించకపోవడం, టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వైసీపీని 2024లో ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు లేకపోవడం ఇవన్నీ బాబు ను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి.బిజెపి కాంగ్రెస్ తో అధికారికంగా కానీ, అనధికారికంగా పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లను సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట.టిడిపి కాంగ్రెస్ పొత్తు వ్యవహారంలో చంద్రబాబు కంటే రాహుల్ గాంధీనే ఎక్కువగా ఆరాటపడుతున్నారట.