నందమూరి బాలకృష్ణని అభినందించిన చంద్రబాబు..!!

Chandrababu Congratulated Nandamuri Balakrishna , TDP, Chandrababu, Nandamuri Balakrishna , Basavatharakam Cancer Hospital

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నందమూరి బాలయ్య బాబుని ట్విట్టర్ వేదికగా అభినందించారు.విషయంలోకి వెళ్తే అవుట్ లుక్ మ్యాగజైన్ ఇండియాలో బెస్ట్ క్యాన్సర్ హాస్పటల్ విభాగంలో బసవతారకం హాస్పిటల్ రెండో స్థానంలో నిలిచింది.ఎంత చంద్రబాబు అభినందించారు.“నందమూరి బాలయ్య బాబుకి మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్( Basavatharakam Cancer Hospital ) యాజమాన్యానికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇండియాలో రెండవ బెస్ట్ ఆంకాలజీ హాస్పిటల్ గా అవుట్ లుక్ మ్యాగజైన్ లో నిలిచినందుకు.

 Chandrababu Congratulated Nandamuri Balakrishna , Tdp, Chandrababu, Nandamuri Ba-TeluguStop.com

తక్కువ ఖర్చుతో కూడుకున్న కారుణ్య సంరక్షణ మరియు పేదలకు సరికొత్త క్యాన్సర్ చికిత్సలు అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ నిర్మించడంలో బృందం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశంసించారు.ఇదే సమయంలో ఇందుకు సంబంధించి ఆర్టికల్ కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి బాలకృష్ణ( Balakrishna ) చైర్మన్ గా రాణిస్తున్నారు.

దీంతో అవుట్ లుక్ ఇండియా మ్యాగ్జిన్ విభాగంలో సెకండ్ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు అందుకోవటంతో చంద్రబాబు అభినందించడం జరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube