కాంగ్రెస్ ష్యూర్ షాట్.. టార్గెట్ ?

తెలంగాణలో( Telangana ) ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్( Congress ) గట్టిగా ప్రయత్నిస్తోంది.తాజా పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నాయని ఈసారి అధికారంలోకి రావడం గ్యారెంటీ అని హస్తం నేతలు చెబుతున్నారు.

 Congress Sure Shot Target , Congress, Telangana, Kcr, Brs, Telangana Politics-TeluguStop.com

గత నాలుగేళ్లుగా కే‌సి‌ఆర్ ( KCR )పాలనపై వ్యతిరేకత ఏర్పడిందని, ఆ వ్యతిరేకతే కాంగ్రెస్ కు ప్లెస్ అవుతుందని హస్తం నేతలు చెబుతున్నారు.దానికి తోడు కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో మరింత జోష్ తో ముదుకు సాగుతున్నారు హస్తం నేతలు.

ఇక ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తుండడంతో రోజు రోజుకు ఆ పార్టీ ప్రభావం గట్టిగానే పెరుగుతోంది.

Telugu Congress, Congress Target, Telangana-Politics

అయితే కాంగ్రెస్ విన్నింగ్ పై ఆ పార్టీ నేతలు అంతా కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు.ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ బి‌ఆర్‌ఎస్( Brs ) కు కాంగ్రెస్ టాఫ్ ఫైట్ ఇస్తుందనే తేల్చి చెబుతున్నాయి.అటు ఆ పార్టీ అంతర్గత సర్వేలు కూడా హస్తం పార్టీ మెరుగ్గా ఉందనే తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో 70 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే నిజంగానే ఆ పార్టీ అన్నీ సీట్లు గెలిచే అవకాశం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి.

Telugu Congress, Congress Target, Telangana-Politics

ఒకవైపు బి‌ఆర్‌ఎస్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా ఆ పార్టీ ఆ పార్టీ 60 నుంచి 70 స్థానాలు అలవోకగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అటు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో హస్తం పార్టీ భావిస్తున్నట్లుగా 80 రావడం కష్టమే అనే సమాధానం వినిపిస్తోంది.కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారం మాదే అంటూ కుండబద్దలు కొడుతున్నారు.

ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో తుది కసరత్తులు చేస్తున్న హస్తం పార్టీ.త్వరలోనే తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే బరిలో నిలిచే అభ్యర్థుల ఆధారంగానే కాంగ్రెస్ గెలిచే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.మరి హస్తం పార్టీ ష్యూర్ షాట్ టార్గెట్ రిచ్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube