దాసరిి నారాయణరావు.టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు.ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా పెద్దలా ముందుండే వ్యక్తి.24 క్రాఫ్టుల్లో ఎవరికి కష్టం వచ్చినా తానున్నాను అంటూ ముందు నిలిచేవాడు.ఆయన ముందుకు ఏ సమస్య వచ్చినా.99 పరిష్కారం అయ్యేది.ఆయన లేని లోటు ప్రస్తుతం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటున్నారు సినిమా పెద్దలు.ప్రస్తుతం జరిగిన మా ఎన్నికల ఘట్టమే ఇందుకు సాక్ష్యం అంటున్నారు.ప్రస్తుతం జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పీఠం కోసం బరిలో నిలిచాడు.ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించగానే తెలుగు సినిమా పరిశ్రమ రెండుగా విడిపోయింది.
ఆయనకు పోటీగా మోహన్ బాబు కొడుకు విష్ణు పోటీకి దిగాడు.
ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
తెలుగువాడు కాని ప్రకాష్ రాజ్ కు మా పగ్గాలు ఇవ్వడం ఏంటనే వాదన తెరమీదకు వచ్చింది.లోకల్, నాన్ లోకల్ అనే వాదన కూడా గట్టిగానే వినిపించింది.
రెండు ప్యానెళ్లు ఒకరిపై మరొకరు మాటలు దూసుకున్నాయి.ఆరోపణలు, ప్రత్యరోపణలు చేసుకున్నాయి.
ఇండస్ట్రీ పరువును బజారున పడేశాయి.అంతేకాదు.
మా ఎన్నికల్లోకి కమ్మ, కాపు అనే కులాల కుంపటి కూడా తోడయ్యింది.చిరంజీవి వర్గం ప్రకాష్ రాజ్ కు సపోర్టు చేసింది.
చిరంజీవి తమ్ముడు నాగబాబు.మంచు విష్ణు ప్యానెల్ పై పలు విమర్శలు చేవాడు.
అటు సినిమా పరిశ్రమ హూందా తనాన్ని కాపాడ్డంలో ముందుండే చిరంజీవి.ప్రతి విషయంలో సంయమనం పాటించే మోగాస్టార్ ఈ విషయంలో అంతగా జోక్యం చేసుకోకపోవడం.నోటికి వచ్చినట్లు మాట్లాడిన తన తమ్ముడు నాగబాబును వారించకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.చిరంజీవి ముందుకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉన్నా ఆయన కలుగజేసుకోలేదు.
అసోసియేషన్ పరువు పోయే పరిస్థితి వచ్చినా ఆయన పట్టించుకోలేదు.ఇదే సమయంలో దాసరి పేరు ముందుకు వచ్చింది.
ఆయనే గనుక ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.అనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.