విశాఖ రాజకీయాల్లో ఆయనది పై చేయి.ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన లీడర్.
ఆంధ్రా లోనే అత్యంత కీలకమైన జిల్లాగా పేరున్న విశాఖను తన కనుసైగలతో శాసించిన ఆ లీడర్ ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నారు.చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఏపీలోనే అత్యంత కీలకమైన నేతగా ఎదిగిన ఆయన గత ఎన్నికలప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అయిపోయారు.
ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.ఈయన గతంలో టీడీపీ నుంచి మంత్రిగా పనిచేశారు.
ఇప్పటికే చాలా పార్టీలు మారిన ఆయన ఇప్పుడు మరోసారి కండువా మార్చబోతున్నారు.
ఇది ఆయనకు ఓ సాంప్రదాయంగా మారిపోయింది.
ఎందుకంటే పార్టీని మార్చకపోతే ఆయనకు అదృష్టం కలిసి రాదనే వాదన ఉంది.గతంలో ఆయన పార్టీ మారిన ప్రతీసారి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ గెలిచింది.
ఇక 2019 ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ మార్చకపోవడంతో ఆయన గెలిచినా పార్టీ మాత్రం ఓటమి చవిచూసింది.దీంతో ఆయన ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు.
పైగా ఆయన ప్రభావం కూడా బాగా తగ్గిపోయింది.దీంతో ఆయన మరోసారి పార్టీ మార్చేందుకు రెడీ అవుతున్నారు.
పైగా ఈ సారి అది జనసేన అవుతుందని చెబుతున్నారు.

ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలను చూసేసిన ఆయన ఇక రాబోయే కాలంలో జనసేన ప్రభావం చూపుతుందనే నమ్మకంతోనే ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.పైగా చిరంజీవితో ఆయనకు మంచి సన్నిహిత్యం కూడా ఉంది.ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యం లో ఉన్నారు.ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.ఇక వైసీపీలో చేరాలనుకున్నా కుదరకపోవడంతో ఇప్పుడు తనకు పాత మిత్రుడు అయిన పవన్‌కు దగ్గరయ్యేందుకు చూస్తున్నారంట.ఇక 31న పవన్‌ను విశాఖకు రాబోతున్న తరుణంలో ఆయనతో కార్మికులకు మద్దతు తెలుపనున్నారు గంటా శ్రీనివాస్.
గతంలోనే పవన్‌ను రావాలని కోరారు ఆయన.ఇప్పుడు ఆయన కోరిక నెరవేర బోతున్న తరుణంలో వీరి బంధం మరింత బలపడే ఛాన్స్ ఉంది.
.