గర్భ రక్షక శ్రీవాసుదేవా మంత్రం ( Garbha Rakshak Srivasudeva Mantra )గర్భస్రావాన్ని నిరోధించడానికి ఉపయోగిస్తారు.శ్రీమద్భాగవతంలో వ్యాసుడు శ్రీవాసుదేవునిచే ఉత్తర గర్భాన్ని రక్షించడం గురించి తెలిపాడు.
వ్యాసుడు చెప్పిన సూత్రాలు మంత్రాల రూపంలో ఉపయోగిస్తారు.గర్భిణులు ఆ గర్భరక్షక శ్రీవాసుదేవ మంత్రాన్ని పాటించడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.
అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర తన కడుపులో పెరుగుతున్న బిడ్డపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించడం గర్భ రక్షక శ్రీ వాసుదేవా మంత్రాన్ని రూపొందించడానికి దారితీసింది.దుర్యోధనుడి సోదరులందరూ మహాభారత యుద్ధంలో మరణించారు.
అతను తుది శ్వాస విడిచే సమయంలో గురువు ద్రోణాచార్యుని( Guru Dronacharya ) కుమారుడు అశ్వత్థామ పాండవులపై ప్రతికాలం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు.ఆ సమయంలో అర్జునుడి కోడలు ఉత్తర గర్భవతిగా ఉంది.
పాండవ వంశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు అశ్వత్థామ దోషరహిత బ్రహ్మస్రాన్ని ఉత్తర గర్భం పై ప్రయోగిస్తాడు.అశ్వత్థామకు కూడా ఆ బ్రహ్మాస్త్రం శక్తి గురించి సరైన జ్ఞానం లేకపోయినా కోపంతో ప్రయోగిస్తాడు.

అశ్వత్థామ దురుసు ప్రవర్తన బ్రహ్మస్త్ర ప్రయోగం( Brahmastra experiment ) శ్రీకృష్ణుడి ఆగ్రహానికి కారణమైందని చెబుతారు.బ్రహ్మాస్త్రం దాడికి ప్రకృతి అంతా వణికిపోయింది.మరోవైపు శ్రీకృష్ణుడు తన రథాన్ని అధిరోహిస్తూ ఉండగా ఉత్తర స్వరం వినిపించింది.వెంటనే ఆయన తన మంత్ర కవచంతో ఉత్తర గర్భాన్ని రక్షించాడు.వాసుదేవుడు ఉత్తర గర్భానికి రక్షకుడిగా మారడంతో బ్రహ్మస్త్రం విఫలమైంది. శ్రీకృష్ణుడు( Lord Krishna ) ఉత్తర గర్భానికి రక్షకుడని వ్యాసుడు శ్రీ మహాద్భుతం లో పేర్కొన్నాడు.
భక్తుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు తన రక్తాన్ని చిందించాడు.

కురువంశ వికాసానికి తన మంత్ర కవచంతో ఉత్తర గర్భాన్ని కాపాడాడు.గర్భంతో ఉన్న ప్రతి మహిళ ఈ మంత్రాన్ని జపించాలి.ఓం అన్తహస్తః సర్వభూతానమాత్మా యోగేశ్వరో హరిః స్వమయ్యవృణోద్ గర్భ వైరత్యః కురుతంత్వే స్వాహా||.
ఇంకా చెప్పాలంటే గర్భ రక్షక శ్రీవాసుదేవ మంత్రం పఠించడం ద్వారా కృష్ణుడు గర్భంలోని బిడ్డ రక్షణ బాధ్యత తీసుకుంటాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఈ మంత్రాన్ని పఠిస్తూ దారాన్ని ముడివేసి ఆ తర్వాత దానిని గర్భిణీకి ధరించడానికి ఇస్తారు.
ఇది గర్భాన్ని కాపాడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.