శివయ్య రుద్రవతారం కాలభైరవుడుగా( Kalabhairava ) పరిగణించబడతాడు.అయితే దుష్ట శిక్షకుడిగా, గ్రహ పీడల్ని తొలగించే దేవుడిగా పూజలను అందుకుంటాడు.
అంతేకాకుండా కాలభైరవుడు రక్షణ, శిక్ష ఇచ్చే దేవుడు అని పురాణాలు పేర్కొన్నాయి.ఇక సోమవారం శివయ్యను( Lord Shiva ) పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో, అదేవిధంగా ఆదివారం నాడు కాలభైరవుడిని పూజిస్తే అనేక సమస్యలు తీరిపోతాయని, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు.
అయితే ఈ రోజు కాలభైరవుడని పూజించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.నిజానికి కాలభైరవుడ్ని పూజించిన వెంటనే సంతోషించి భక్తులపై అనుగ్రహం ఇస్తాడు.

అదే సమయంలో తప్పు చేసేవారికి కూడా శిక్ష ఇస్తాడని పురాణాలు పేర్కొన్నాయి.అందుకని అత్యంత భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వామిని పూజిస్తారు.శివుని స్వరూపం కావడం వలన రుద్రుడిలోంచి పుట్టిన కాలవ భైరవ స్వామిని అనుగ్రహం శివయ్యను పూజించిన లభిస్తుంది.భైరవుడిని వారంలో ఏ రోజైనా ఎప్పుడైనా కూడా పూజించవచ్చు.
అయితే ప్రత్యేకంగా ఆదివారం భైరవుడిని ఆధారించడం కోసం అంకితం చేయబడింది.భైరవుడు శివుని రుద్రవతారంగా పరిగణించబడతాడు.
అందుకే భైరవుడి నీ ఆధారించడం పై ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఇక మత విశ్వాసాల ప్రకారం శివుని అగ్ని రూపమైన కాలభైరవుడిని పూజించడం వలన భయం నశిస్తుంది.అంతేకాకుండా మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయి.భైరవుడిని రాత్రి సమయం లోనే పూజించాలి.
ఆ సమయంలో పూజలు చేయడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.ఇక నియమ, నిబంధనల ప్రకారం, మీ సౌలభ్యం ప్రకారం కాలభైరుని ఎప్పుడైనా పూజించవచ్చు.
అయితే ప్రదోషకాలంలో( wrong time ) భైరవుని ఆధారణ కూడా చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.