దీపావళి ముందు ఈ శకునాలు ఎదురైతే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

దీపావళి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుంటారు.

 6 Signs Before Diwali That Indicate Good News-TeluguStop.com

దీపావళి రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి తలస్నానము చేసి లక్ష్మి గణపతిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం.హిందూ శాస్త్రాల ప్రకారం శకునాలు బాగా నమ్మే వారు చాలా మంది ఉన్నారు.

శకునం బాగుంటే మంచి జరుగుతుందని,శకునం బాగా లేకపోతే చెడు జరుగుతుందని నమ్ముతారు.అయితే దీపావళి ముందు వచ్చే శకునాల వలన మంచి జరుగుతుందట.

 6 Signs Before Diwali That Indicate Good News-దీపావళి ముందు ఈ శకునాలు ఎదురైతే…అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటి గురించి తెలుసుకుందాం.ఈ శకునాలు ఉద్యోగం, వివాహం, విద్య,సంతానం ఏ విషయంలోనైనా కావచ్చు.

దీపావళి ముందు కలలో అరచేతి నుంచి ధనం జారుతున్నట్టు వస్తే మీ ఆర్ధిక పరిస్థితి త్వరలో కుదుట పడుతుందని అర్ధం.

చాతీ భాగం,అరచేతులతో దురద వస్తే త్వరలో సంపద పెరుగుతుందని అర్ధం.

దీపావళి ముందు కలలో సన్నిహితులు,ఆత్మీయులు కనపడితే శుభవార్తలు వింటారు.

కలలో ఎక్కువగా 8 నెంబర్ కనపడితే శుభ శకునం.

ఎందుకంటే ఈ సంఖ్య లక్ష్మి దేవికి సంబంధించింది.

ఇంటిలో చీమలు కనపడితే ఇంటిలో త్వరలో శుభకార్యం జరుగుతుందని సంకేతం.

దీపావళి ముందు ఇంటి చుట్టూ బలమైన సాలీడ గూడు కనపడితే అపారమైన సంపద రావటానికి సూచన.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU