మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదా.. అయితే దేవుడికి ఇలా..

సాధారణంగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి.కానీ కొందరిని మాత్రం ఈ కష్టాలు జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి.

 No Matter What You Do, You Don't Come Together.. But God Likes This , Shani Dosh-TeluguStop.com

అలాంటి వారు ఏం పని చేసినా అసలు కలిసి రాదు.ఇలాంటి వారికి శని దోషం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అందరూ ఈ సృష్టిలో శని అంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాడని ఒక్కసారి శని ఆవహిస్తే దాదాపు ఏడు సంవత్సరాల పాటు దూరమైపోడని భావిస్తూ ఉంటారు.

ఎవరికైనా వారు చేసిన తప్పుల వల్ల కర్మ ఫలితాలను అనుభవింప చేసేవాడు శని అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మనిషి పై శని ప్రభావం తగ్గాలంటే తప్పకుండా శనీశ్వరునికి పూజ చేయాలని చెబుతున్నారు.శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆ శని ప్రభావం నుంచి త్వరగా బయటపడవచ్చు అని సలహా కూడా చెబుతున్నారు.

శనీశ్వరుని అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శని ప్రభావం దూరం అయిపోతుందని చెబుతున్నారు.అందుకోసం శని దేవుడికి ఎంతో ఇష్టమైన వాటిలో శివలింగా పూజ ఒకటి అని చెబుతున్నారు.

శని దేవుడిని ఈశ్వరుని అంశంగా భావించి శనీశ్వరుడుగా పూజలు అందుకుంటాడని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే శనికి ఎంతో ఇష్టమైన శివలింగా అభిషేకం చేయడం వల్ల శని దోషాలు దూరం అయిపోతాయని పండితులు చెబుతున్నారు.

శని ప్రభావంతో బాధపడేవారు నిత్యం శివలింగానికి అభిషేకం చేయడం మంచిది.

Telugu Devotional, Lord Shani, Shani Dosha, Puja, Tirumala-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే శనివారం రోజు శివాలయంలో ప్రసాదాలు పంచడం, ప్రతి రోజు నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు.అంతేకాకుండా శనివారం హనుమంతుడిని, శ్రీవారిని దర్శించుకోవడం సుందరకాండ చదవడం వంటి వాటి ద్వారా కూడా శని ప్రభావాన్ని దూరం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube