ఇటీవల రోజుల్లో యువతీ, యువకులెందరో జుట్టును షైనీగా మెరిపించుకోవడం కోసం హెయిర్ జెల్స్‌ను విచ్చల విడిగా వాడేస్తున్నారు.రెగ్యులర్‌గా వాడే వారూ ఎందరో ఉన్నారు.
అయితే హెయిర్ జెల్స్ శిరోజాల అందాన్ని పెంచినా.వాటి వల్ల భయంకరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
హెయిర్ జెల్స్‌లో ఉండే పలు రకాల కెమికల్స్ జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసి అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.మరి ఆలస్యమెందుకు హెయిర్ జెల్స్ ను రోజూ వాడటం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
హెయిర్ జెల్స్‌లో ఉండే రసాయనాలు జుట్టు మరియు తల మీద ఉండే తేమను మొత్తం పీల్చేస్తాయి.దాంతో జుట్టు పొడి బారి పోయి ఎండి పోయినట్టు అయిపోతుంది.
చుండ్రు, తలలో దురదలకు కూడా హెయిర్ జెల్స్ కారణం అవుతాయి.అందుకే వాటిని యూజ్ చేయడం ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటున్నారు.

అలాగే హెయిర్ జెల్స్ వాడే వారిలో హెయిర్ ఫాల్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.ఎందు కంటే, హెయిర్ జెల్స్ లో ఉండే పలు కెమికల్స్ జుట్టు కుదుళ్లను బలహీన పరిచేస్తాయి.దాంతో జట్టు రాలి పోయి సన్నగా తయారు అవుతుంది.తమ జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ ఉండాలీ అనుకునే వారు హెయిర్ జెల్స్ జోలికే పోకూడదు.
ఎందుకూ అంటే, హెయిర్ జెల్స్‌ను ప్రతి రోజు వాడటం వల్ల జుట్టు సహజ నలుపును కోల్పోయి అందవిహీనంగా మారుతుంది.అంతే కాదు, హెయిర్ జెల్స్ తరచూ యూజ్ చేస్తే గనుక అందులోని హానికరమైన రసాయనాల కారణంగా జుట్టు చివర్లు చిట్లి పోవడం, మధ్యలోకి విరిగి పోవడం, కేశాలు బలహీనంగా మారడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి, జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే హెయిర్ జెల్స్ ను రోజూ వాడే అలవాటును మానుకోండి.