ఎన్టీఆర్ వల్ల సినిమాల్లోకి.. చిరంజీవి హితోపదేశం.. ఇదే హీరో శ్రీకాంత్ దైర్యం!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సమయాలలో ధైర్యం కోల్పోతుంటారు.అది వ్యక్తిగత విషయంలోనైనా లేదా సినిమా విషయంలోనైనా.

 Ntr Action Inspiration To Srkanth Ntr, Bala Krishna, Sri Kanth, Tollywood, Akaha-TeluguStop.com

ఏదైనా సమస్య కలిగినప్పుడు తమ ధైర్యాన్ని కోల్పోతుంటారు.నిజానికి ఎక్కువగా సినిమాల విషయంలోనే ధైర్యాన్ని కోల్పోతారు.

ఎందుకంటే తాము నటించిన సినిమాలు వరుసగా అపజయాలు పొందటంతో నిరాశ పడుతుంటారు.దాని వల్ల మరో సినిమాలో నటించాలన్న ధైర్యం కూడా చూపించలేకపోతారు.

మళ్లీ ఆ సినిమా కూడా ఎక్కడ అపజయాన్ని అందిస్తుందో అని ఆ సినిమాకు ఆసక్తి చూపరు.ఆ సమయంలో వారికి ఎవరో ఒకరు ప్రముఖులైన లేక కుటుంబ సభ్యులైన ధైర్యం ఇస్తుంటారు.

అలా మరోసారి తమ నమ్మకాన్ని, ధైర్యాన్ని పరీక్షించి ముందుకు వెళ్తుంటారు.అలా ఓసారి హీరో శ్రీకాంత్ కూడా ధైర్యం కోల్పోవటంతో తనకు కూడా ఇతరుల ధైర్యం అనేది అందింది.

అలా ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకొని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

తొలిసారిగా శ్రీకాంత్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు.శ్రీకాంత్ తొలిసారిగా చిన్న చిన్న పాత్రలలో, విలన్ పాత్రలలో నటించాడు.

ఆ తర్వాత హీరోగా అడుగు పెట్టడంతో ఆయన నటించిన ఎగిరే పావురమా, ప్రేయసి రావే, ఆహ్వానం, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు అందించాయి.

Telugu Akahanda, Bala Krishna, Ooha, Sri Kanth, Tollywood-Movie

అలా ఎన్నో కుటుంబ కథా నేపథ్యంలో నటించి దాదాపు 125 సినిమాలకు పైగా నటించాడు.అలా మంచి హోదాలో ఉన్న సమయంలోనే తనతో కలిసి నటించిన ఊహ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.

అందులో శ్రీకాంత్ అనే పెద్ద కొడుకును టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు.

గతంలో శ్రీకాంత్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండగా.

మళ్లీ రీ ఎంట్రీ తో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే బాలయ్య నటించిన అఖండ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించాడు.

కానీ ఇందులో తన పాత్రకు అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.కానీ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Telugu Akahanda, Bala Krishna, Ooha, Sri Kanth, Tollywood-Movie

శ్రీకాంత్ విలన్ గా కంటే హీరో గానే మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన కొన్ని సంవత్సరాల కిందట ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అప్పుడే తను కోల్పోయిన ధైర్యం గురించి తెలిపాడు.తాను 8వ తరగతి చదువుతున్నప్పుడు తనకు బాగా సినిమాలు చూసే అలవాటు ఉందని.బాగా ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే నచ్చేవని తెలిపాడు.

Telugu Akahanda, Bala Krishna, Ooha, Sri Kanth, Tollywood-Movie

దాంతో తనకు సినిమాలలో నటించాలన్న ఆశ ఉండటంతో డిగ్రీ పూర్తిచేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఆ తర్వాత సినిమాలో అడుగు పెట్టానని తెలిపాడు.ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నానని తెలిపాడు.ఇక 1998లో తాను నటించిన 9 సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయని ఆ సమయంలో బాగా ఒంటరిగా ఉన్నానని తెలిపాడు.

Telugu Akahanda, Bala Krishna, Ooha, Sri Kanth, Tollywood-Movie

దీంతో తనకు చిరంజీవి ఫోన్ చేసి తనతో మాట్లాడాడని తాను కూడా తన జీవితంలో మేకప్ లేకుండా ఒక సంవత్సరం పాటు సినిమాలు చేయలేదని తెలిపాడట.అపజయం వస్తే కుంగిపోకూడదని హితోపదేశం చేశాడట.దాంతో అప్పటి నుంచి తనకు తెలియకుండానే ధైర్యం వచ్చిందని తెలిపాడు శ్రీకాంత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube