టాలీవుడ్ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన దర్శకునిగా దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది.భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే ఈ దర్శకుడు సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగేలా చేయడంతో పాటు నిర్మాతలకు కచ్చితంగా లాభాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ చరణ్ రామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా చేశారని ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ల ద్వారా ప్రేక్షకులకు క్లారిటీ వస్తోంది.
సినిమాలో చరణ్, తారక్ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.అయితే కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించడం గురించి స్పందించిన భీమ్ మనవడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొమురం భీమ్ మనవడు కొమురం సోనేరావ్ భీమ్ చేసిన పోరాటానికి సినిమా రూపం ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.
ప్రపంచానికి భీమ్ చరిత్రను చెబుతున్న జక్కన్నకు సోనేరావ్ ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వివాదాల్లో చిక్కుకోకుండా ఈ సినిమా ఫిక్షన్ అని రాజమౌళి ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.రామ్, భీమ్ అనే రెండు పాత్రల మధ్య అద్భుతమైన స్నేహాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నామని రాజమౌళి కామెంట్లు చేశారు.సినిమా చూసే సమయంలో ఏ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత అనే ఆలోచన రాదని రాజమౌళి పేర్కొన్నారు.

సినిమా మొదలైన తర్వాత ఎన్టీఆర్, చరణ్ లోని నటులు మాత్రమే కనిపిస్తారని జక్కన్న చెప్పుకొచ్చారు.ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తమ స్నేహంలో నుంచి పుట్టిన సినిమా అని ఎన్టీఆర్ అన్నారు.చరణ్ తో తన స్నేహం చిరకాల స్నేహమని తారక్ పేర్కొన్నారు.
స్టార్టింగ్ లో ఆలియా భట్ తో మాట్లాడటానికి కొంత సమయం మొహమాటపడ్డానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అని ఓకే చెప్పానని ఆ సినిమా పాన్ ఇండియా సినిమానా? అని ఆలోచించలేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.