ఆయన పాటలు మధురాతి మధురం.ఆయన గానం అమ్రుత కలశం.
తన పాటలు వింటుంటే మది పులకించిపోతుంది.అది జానపద చిత్రం అయినా.
పౌరాణికం అయినా.సాంఘికం అయినా.
తన పాటలు సినిమాకు విజయాన్ని అందించడంలో ఎంతో ఉపయోగపడ్డాయి.తన మధురగానంతో తెలుగు జనాలను సంగీతం ప్రపంచంలో హోలలాడించిన మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్ రావు.
ఆయన గొంతు నుంచి వేల పాటలు ప్రాణం పోసుకున్నాయి.ఎన్నో సినిమాలు తన గానంతో అదనపు సొబగులు అద్దుకున్నాయి.
అలాంటి ఘనాపాటి ఘంటసాలకు ఓ వింత అలవాటు ఉండేది.ఇంతకీ ఆ అలవాటు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఘంటసాల వెంకటేశ్వర రావు ఎప్పుడు పాటల రికార్డింగ్‌కు వెళ్లినా.చేతిలో రుమాలు తప్పకుండా ఉంచుకునే వాడట.అది లేకుండా తను రికార్డింగ్ రూములోకే వెళ్లేవాడు కాదట.పొరపాటున మర్చిపోతే కర్చీప్ లేకుండా పాటలు పాడటం ఎలా అని సంకోచించే వాడు.
కర్చీప్ లేకుండా పాడే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేవాడట.అంతేకాదు.
పాటలు పాడే సమయంలో కుడి చెవిని కుడి చేత్తో మూసుకునే వాడట.అలా మూసుకుంటేనే తన గాత్రం బావుండేదట.తను ఆ పద్దతిని పాటించకపోతే పాటలో తప్పులు దొర్లేవట.అందుకే చేతిలో రుమాలు అలా అలవాటు అయ్యిందట.

ఒకానొక సమయంలో ఆయనకు చెవిలో ఏదో సమస్య ఉన్నట్లు అనిపించిందట.దీంతో డాక్టర్లు దగ్గరకు వెళ్లాడట.అక్కడ పలు వైద్య పరీక్షలు చేయించుకున్నాడట.అయితే తనకు ఏ సమస్యా లేదని డాక్టరు చెప్పాడట.చిన్న చెవి ఒత్తిడి వల్ల కలిగిన సమస్య మాత్రమే అని చెప్పాడు.త్వరలోనే తగ్గిపోతుందన్నాడట.
మీకు పాడేందుకు గొంతు బాగానే ఉంది కదా.అన్నాడట.అందుకు తను అంగీకరించలేదట.తన చెవికి పాట వినిపిస్తే బాగున్నట్లు అని చెప్పాడట.అంతేకాదు.చెవి సమస్య బయటపడేంత వరకు తను పాటలు పాడలేదట.
సుమారు పది రోజుల పాటు పాటల రికార్డింగులు వెల్లలేదట.తన చెవి సమస్య తగ్గగానే మళ్లీ పాటలు పాడ్డం మొదలు పెట్టాడట.