‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో యూత్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి క్రేజీ హీరోగా మారిపోయాడు.విజయ్ దేవరకొండ అనగానే కుర్రకారు ఉర్రూతలూగిపోతున్నారు.‘గీతా గోవిందం’ చిత్రంతో కేవలం యూత్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత క్రాంతి మాదవన్ దర్శకత్వంలో నటించనున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

విజయ్ నటించే ప్రతి చిత్రంలో కొత్తదనం ఉంటుంది.బోర్ కొట్టించే పాత్రలు కాకుండా ఈ ట్రెండ్‌కు తగినట్టుగా ఉండి యూత్‌ను బాగా ఆకట్టుకునేలా ఉంటాయి.తన పాత్రల ఎంపిక విషయంలో విజయ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు అనేది అందరికి తెల్సిందే.క్రాంతి మాదవన్ తెరకెక్కించే చిత్రంలో విజయ్ విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు.ఈ చిత్రంలో విజయ్ ప్లే బాయ్‌గా కనిపించనున్నాడు అని టాక్.ముగ్గురు ముద్దుగుమ్మలతో ఈ చిత్రంలో విజయ్ రొమాన్స్ చేస్తాడట!

రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసాలతో విజయ్ రొమాన్స్ చేయనున్నాడు.‘అర్జున్ రెడ్డి’ లో ఒక్క హీరోయిన్‌తో రొమాన్స్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెల్సిందే.ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో అంతకు మించిన రొమాన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఈ చిత్రం కూడా కుర్రకారుకి కనెక్ట్ అయ్యేలా ఉంటందట.అతి త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టనున్నారు.ప్లే బాయ్‌గా కనిపించబోతున్నాడు అనగానే విజయ్ అభిమానులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.