పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన లక్ష్మి పార్వతి..!!

తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె వైసిపి పార్టీ అభ్యర్థి గురుమూర్తి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 Lakshmi Parvati Satires Pawan Kalyan Tirupathi, Lokesh, Pawan Kalyan, Lakshmi Pa-TeluguStop.com

టీడీపీ యువనేత నారా లోకేష్ అసలు ఏమి మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొన్నారు.టీడీపీని గెలిపిస్తే పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు తగ్గిస్తామని కనీస అవగాహన లేని హామీలు నారా లోకేష్ ఇస్తూ ప్రచారంలో నవ్వులపాలు అవుతున్నాడని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో కనీసం ఓటు బ్యాంకు లేని బీజేపీ ఈ ఎన్నికలలో గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ బ్రాహ్మణులకు వంశపారపర్యంగా అర్చకులుగా గుర్తిస్తూ వారిని కొనసాగించే రీతిలో ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆనాడు వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటు అయిందని ధర్మాన్ని కాపాడారని అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల పులివెందల నియోజకవర్గం గురించి దిగజారుడు కామెంట్ చేయటం దారుణం అని పేర్కొన్నారు.ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ఊరు పులివెందుల అని.అలాంటి ఊరు పై ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ కూడా నోరు జార లేదని, కానీ అతనికి తమ్ముడు గా ఉన్నా పవన్ కి నోటి దూల ఎక్కువగా ఉందని ఆమె సెటైర్లు వేశారు.

మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.  పవన్  60 సంవత్సరాలకి  దగ్గరలో ఉన్నారు, ఇంకా చిన్న పిల్లోడు మాదిరిగా మాట్లాడకూడదు అంటూ సెటైర్లు వేశారు .ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన కానీ టిడిపి పార్టీ ని బాగు చేసే పరిస్థితి ఏమీ లేదని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube