జనసేన టీడీపీ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని పవన్ ( Pawan Kalyan )ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు కూడా.
సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఇరు పార్టీల మద్య బంధాన్ని మరింత బలపరిచేందుకు వేగంగా డుగులు వేస్తున్నారు.అయితే అటు టీడీపీలో అధినేత అరెస్ట్ కారణంగా ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీలను బలంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేవలం పవన్ పైనే పడింది.అయితే ఆయన మాత్రం ఇంకా అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదు.

ఎప్పుడో ఒకసారి వారాహియాత్ర ( Varahiyatra )మాత్రమే చేస్తూ మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కేవలం యాత్రలు పర్యటనలు మాత్రమే చేస్తే సరిపోతుందా ? అంటే కాదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది.అధికారం దక్కించుకోవాలంటే నిత్యం ప్రజల దృష్టి ఆ పార్టీపైనే ఉండేలా చూసుకోవాలి.ప్రజల్లో ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో, హామీలు కార్యక్రమాలు వంటివి తరచూ చర్చల్లో నిలుస్తూ ఉండాలి.
ఇలా చేసినప్పుడే మెజారిటీ ఓటు బ్యాంకు ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.కానీ టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన తరువాత ఇరు పార్టీలు కలిసి చేపట్టబోయే కార్యక్రమాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు.

అటువైపు వైసీపీ మాత్రం వచ్చే 5 నెలల వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించింది.మరి టీడీపీ జనసేన కూటమి( Janasena TDP ) ముందురోజుల్లో ఏమైనా కార్యక్రమాలను చేపట్టే దిశగా అడుగులు వేస్తాయా లేదా అనేది సందేహమే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) బయటకు వచ్చే వరకు సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.మేనిఫెస్టో రూపకల్పన కూడా జరిగే అవకాశం లేదు.
ఇక కూటమి కన్ఫర్మ్ అయినందున జనసేన సొంతంగా అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పన చేయడం కుదరని పని.దాంతో పవన్ కూడా సైలెంట్ అవుతున్నారు.అయితే కూటమిపై ప్రజల ఫోకస్ పడాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయాలి.లేదంటే నష్టం తప్పదనేది కొందరి అభిప్రాయం.