టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్‌బాబు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను నిజంగానే కలుసుకున్నారు.ఆయనతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయం చేయాల్సిందిగా కోరారు.ఈ సందర్భంగా చంద్రబాబు ‘గొప్ప పనిమంతుడు’ అని బరాక్ ఒబామా మెచ్చుకున్నారు.
ఇదంతా లోకేష్ ట్విటర్‌లో పోస్టు చేశారు.ఆయన ఒబామాను కలుసుకున్న ఫొటో కూడా పోస్టు చేశారు.
ఎందుకింత రుజువుల చూపించాల్సివచ్చిదంటే….లోకేష్‌కు అమెరికా అధ్యక్షుడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, ఇదంతా బూటకపు ప్రచారమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచారం చేసింది.
ఎటువంటి హోదా లేని లోకేష్‌కు ఒబామా ఎలా అప్పాయింట్‌మెంట్ ఇస్తారని ప్రశ్నిస్తూ, ‘అసలు రహస్యం’ చెప్పంది.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడని, ఎవరైనా పదివేల డాలర్లు చెల్లిస్తే ఆయనతో డిన్నర్ చేసే అవకాశం ఉందని, లోకేష్ ఆ విధంగా డబ్బు కట్టి డిన్నర్‌కు అవకాశం సంపాదించుకున్నాడు తప్ప ఒబామా ప్రత్యేకంగా అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అతనికి అంత సీన్ లేదని తన మీడియా ద్వారా ప్రచారం చేసింది.
తాను నిజంగానే ఒబామాను కలుసుకున్నానని, వైకాపా దుష్ర్పచారం చేసిందని లోకేష్ చెబుతున్నాడు.ఏపీకి పెట్టుబడులు తేవడం కోసం లోకేష్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
.