తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిపక్షాలకు ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ పార్టీకి విందుగా, పసందుగా ఉంది.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన వైకాపా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎపిసోడ్లో కేసీఆర్ సర్కారుకు పూర్తిగా మద్దతు ఇస్తోంది.
తనపై అదే పనిగా అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీని, వ్యక్తిగతంగా చంద్రబాబును మట్టికరిపించాలనేది జగన్ లక్ష్యం.రేవంత్ రెడ్డి ఉదంతం ఇందుకు బాగా కలిసివచ్చింది.
అందుకే కేసీఆర్‌కు పూర్తి మద్దతు ఇస్తూ చంద్రబాబు అంతు చూడాలనుకుంటోంది.రేవంత్-బాబు వ్యవహారాన్ని జగన్ జాతీయ స్థాయికి తీసుకెళుతున్నాడు.
ఆయన మంగళవారం ఢిల్లీలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి బాబు-రేవంత్ వ్యవహారాన్ని వివరిస్తారు.చంద్రబాబు రాజీనామా కోరుతూ ఏపీలో వైకాపా ధర్నాలు, ఇతర ఆందోళనలకు సిద్ధమవుతోంది.
రాజ్‌నాథ్ సింగ్‌కు బాబు-రేవంత్ ఎపిసోడ్ గురించి తెలియకుండా ఉంటుందా? కేంద్రానికి అన్ని విషయాలు తెలుసు.ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదిర్చేందుకు కేంద్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీడీపీ ఇప్పటికే భాజపాకు మిత్రపక్షం.వీలైతే టీఆర్‌ఎస్‌ను కూడా ఎన్‌డీఏలోకి లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కాబట్టి భాజపాకు ఇద్దరు ముఖ్యమంత్రులూ కావల్సినవారే.