యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ఉంటూ, ఊతమిస్తూ.2023-24 సంవత్సరానికి మొదటి విడత.వైఎస్సార్ లా నేస్తం( YSR Law Nestham )రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి, 2023 – జూన్, 2023 (5 నెలలు) కు ఒక్కొక్కరికి రూ.25,000 ఇస్తూ, మొత్తం రూ.6,12,65,000 ను నేడే (26.06.2023) సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం( YS Jagan Mohan Reddy ).నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.41.52 కోట్లు.
న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేసి, న్యాయవాదులు అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్( Group Mediclaim ) పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం.ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్ లో [email protected] ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాలి.”వైఎస్సార్ లా నేస్తం” వధకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 ను సంప్రదించగలరు