ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువన్న ఆయన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.
ఇండియాలోనే అతిపెద్ద ఆక్వా హాబ్ సిద్దం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.తెలంగాణలో హరిత విప్లవం, నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తోందన్నారు.తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ఆయన రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో షాపింగ్ మాల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.







