పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన సినిమాల ద్వారా ఎంతోమందికి లైఫ్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.పవన్ సినిమాలు నిర్మాతలకు సైతం భారీ లాభాలను అందించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ( Bro movie ) మరో నెల రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి ( Posani Krishnamurali )ఈ మధ్య కాలంలో మూవీ ఆఫర్లు తగ్గుతున్నాయనే సంగతి తెలిసిందే.పోసాని వైసీపీకి అనుకూలంగా పని చేస్తుండటం వల్లే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలలో ఆయనకు ఆఫర్లు రావడం లేదని టాక్ ఉంది.
అయితే పోసాని సైతం మెగా హీరోలపై ఆరోపణలు చేయడం వల్లే తనకు సినిమా ఆఫర్లు తగ్గాయని అయితే పవన్ మంచివాడు అని ఆయన అన్నారు.

పవన్ పార్టీ పెడుతున్నాడని చెప్పిన వెంటనే కాకినాడలో ప్రెస్ మీట్ ( Kakinada )పెట్టి వెల్కం చెప్పింది నేనేనని పోసాని అన్నారు.60 సంవత్సరాల వయస్సు ఉన్న నాకు కొత్త పాత్రలు రావడం సులువు కాదని అయితే పవన్ నా కెరీర్ ను అపేసినా నాకొచ్చిన నష్టం ఏ మాత్రం లేదని పోసాని కృష్ణమురళి అన్నారు.చంద్రబాబుతో ( Chandrababu )పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అని పోసాని చెప్పుకొచ్చారు.

పవన్ చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల దిగజారి మాట్లాడుతున్నాడని నేను కామెంట్ చేశానని పోసాని పేర్కొన్నారు.పోసాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.పోసాని కెరీర్ పరంగా, రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ ఏడాది పోసానికి కలిసొస్తుందేమో చూడాలి.2024 ఎన్నికల్లో పోసాని పోటీ చేస్తారేమో తెలియాల్సి ఉంది.







