పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కి ఉరి శిక్ష

పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన ముషారఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.అయితే ఆ సమయంలో ఆయన తీవ్రమైన దేశ ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.దీంతో పాటు చట్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు అంటూ అనేక అభియోగాలు ఆయనపై వచ్చాయి.

 Musharraf Sentenced To Death By Lahore Court-TeluguStop.com

సుదీర్ఘ కాలం ముషారఫ్ పై వచ్చిన అభియోగాలను విచారించిన లాహోర్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.ఒక దేశ అధ్యక్షుడుకి మరణ శిక్ష విధించడం ఇది రెండోసారి.గతంలో పాకిస్తాన్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఈ విధంగానే ఉరి తీశారు.2007వ సంవత్సరంలో నవంబర్ 3వ తేదీన పాకిస్తాన్ లో ఎమర్జెన్సీని విధించారు.

ఆ సమయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ, నిరంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపట్టింది.దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదయింది.ఈ కేసు నమోదు అయిన తర్వాత కేవలం ఒకే ఒక సారి మాత్రమే ఆయన కోర్టుకి హాజరయ్యారు.ఆ తరువాత ఆరోగ్య కారణాలతో 2016 మార్చిన దేశం విడిచి వెళ్లారు.

అప్పటి నుంచి ఆయన దుబాయ్ లో తల దాచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube