లోకేష్ ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ పరిపాలనపైనా భారీ భారీ డైలాగులు వదులుతున్నారు.
పంచులు, ప్రాసలతో విరుచుకుపడుతున్నారు.జగన్ రెడ్డీ అంటూ ప్రతి విషయంపైనా లోకేష్ స్పందిస్తూ, నానా హడావుడి చేస్తున్నారు.
లోకేష్ ఈ రకంగా యాక్టివా అవుతారని టిడిపి నేతలు, వైసీపీ నాయకులు ఎవరూ ముందు ఊహించలేదు.చంద్రబాబు రాజకీయ వారసుడిగా , నూటికి నూరుపాళ్లు సక్సెస్ఫుల్ నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారు.
ప్రతి విషయంలోనూ లోకేష్ స్పందిస్తున్నారు.ఈ రకంగా అయినా లోకేష్ రాజకీయంగా సమర్థుడని, జగన్ కు సరైన ప్రత్యర్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు .
అయితే లోకేష్ పోరాటం, భారీ భారీ డైలాగులు అన్నీ ప్రత్యక్షంగా మాత్రం లేవు.జూమ్ ద్వారానో, మీడియా సమావేశాలలో మాత్రమే కనిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు లోకేష్ ముందుకు రావడం లేదు.ఇప్పుడు కూడా ఏపీలో ఎన్నో రకాల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలోనూ, తీసుకుంటున్న నివారణ చర్యలు విషయంలోనూ , ఆసుపత్రులలో సరైన వైద్యం అందక పోవడం, ఆక్సిజన్ కొరత ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దీనిపైనా లోకేష్ స్పందిస్తున్నారు.
ఎక్కడో హైదరాబాద్ లో ఉండి లోకేష్ మాట్లాడుతున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం నోరు మెదపకపోవడంతో జనాల్లోకి లోకేష్ విమర్శలు వెళ్లడం లేదు.

కేవలం అన్ని ట్విట్టర్ ద్వారానే అదే రాజకీయం అనుకుంటే జనాల్లో పట్టు సాధించడం సాధ్యం కాదనే విషయాన్ని లోకేష్ గుర్తించలేకపోతున్నారు.లోకేష్ విమర్శలపైన వైసిపి స్పందిస్తోంది.ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటూ, ఇక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని, ఏదైనా ఉంటే ఇక్కడే తేల్చుకోవాలి అంటూ ఘాటుగా సమాధానం వైసీపీ నాయకులూ చెబుతున్నా, లోకేష్ లో మాత్రం స్పందన కనిపించడం లేదు.
ప్రస్తుతం ఏపీ లో అనేక సమస్యలు ఉన్నాయి.అమరావతి ఉద్యమం మొదలై అప్పుడే 500 రోజులు అవుతుంది.దాని పైన, కరోనా విషయంలోనూ, పార్టీ నేతలపై వేధింపులు ఇలా అన్నింటి పైనా లోకేష్ ఏపీలో ఉండి స్పందిస్తే బాగుంటుంది.అలాగే ఆయన ఏపీలోనే నివాసం ఏర్పాటు చేసుకుని వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తే వచ్చే ఫలితం వేరేగా ఉంటుంది అనే అభిప్రాయం సైతం తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.
లోకేష్ ఎప్పుడు కదన రంగంలోకి దూకి పార్టీని బలోపేతం చేసి, వైసీపీ కి ముచ్చెమటలు పట్టిస్తారో ?
.