యాంకర్ లలో బెస్ట్ యాంకర్ అని అడిగితే ముందు అందరు చెప్పే పేరు సుమ.( Anchor Suma ) అంతలా కొన్నేళ్ల నుంచి నిలబడే షోలని నిలబెడుతుంది.
ఈటీవీ షోలో, సినిమా ఈవెంట్స్ లో ఎక్కడ చూసిన సుమనే కనిపిస్తుంది.తన టైమింగ్ తో అందరికి ఎంటర్ టైన్ చేస్తుంది.
అయితే ఇప్పుడు సుమ యాంకర్ గా చేస్తున్న షోలకు రేటింగ్ లు తగ్గిపోయాయి.అంతే కాదు ఈటీవీలో మరో యాక్టర్ చేస్తున్న షో కూడా చెట్టులేత్తిసిందని టాక్ నడుస్తుంది.
అదే అలీ( Comedian Ali ) చేస్తున్న షో.గత కొన్ని నెలల నుంచి ఈటీవీలో వచ్చే షోలకు రేటింగ్ పడిపోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే ఈటీవీలో చాలా షోలు నడుస్తున్నాయి.ముఖ్యంగా బుధవారం ఢీ, గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్, శనివారం సుమ అడ్డా షోలు వస్తున్నాయి.వీటితో పాటు ఆలీ కూడా ఒక షో చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈటీవీలో వచ్చే షోల రేటింగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
జబర్దస్త్ లో ( Jabardasth ) సుదీర్, శ్రీను వెళ్లిపోవడంతో ఆ ఎఫెక్ట్ కనిపించిందని చెప్పాలి.ఇక రామ్ ప్రసాద్, ఆది కొన్ని షోలని గట్టిగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు.
ముందు ఢీ( Dhee Show ) కంటే పోలిస్తే ఇప్పుడు ఢీ చూసేవారి సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి.ఇక సింగర్ చరణ్ నడిపిస్తున్న షో స్లో అయ్యిందనే అంటున్నారు.
గతంలో ఈటీవీలో ఆలీతో సరదాగా( Alitho Saradaga ) అనే షో వచ్చేది.ఈ షోలో ఆలీ పాత యాక్టర్స్ ని తీసుకొచ్చి సందడి చేసేవారు.పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోడంతో అందరికి ఇంట్రెస్ట్ ఉండేది.రాను రాను ఈ షోలో ట్రెండింగ్ యాక్టర్స్ ని తీసుకొచ్చారు.దీంతో ఈ షో రేటింగ్స్ పడిపోవడం మొదలయ్యాయని టాక్.ఆ తరువాత కొన్నిరోజులు అలీ రాజకీయాల్లోకి వెళ్లి షోలకి బ్రేక్ ఇచ్చాడు.
తాజాగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి ఆలీతో ఆల్ ఇన్ వన్( Alitho All In One ) అనే షోకు శ్రీకారం చుట్టాడు.అయితే ఈ షో ప్లాప్ అయ్యింది.
ఈ షోకి మరి దారుణమైన రేటింగ్ వచ్చిందట.ఈ షోకి 1.94 రేటింగ్స్ వచ్చాయి.
ఇక సుమ యాంకరింగ్ చేస్తున్న సుమ అడ్డా షో( Suma Adda Show ) కూడా చేతులెత్తేసింది.ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్ట్ గా వచ్చారు.అయితే రెగ్యులర్ షో అవ్వడం, సుమ రొటీన్ పంచెస్ ఉండడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది.ఈ షో అయిన అదిరిపోయే రేటింగ్ తెస్తుందేమో అనుకుంటే ఈ షోకి దారుణంగా జస్ట్, 2.13 రేటింగ్స్ వచ్చాయి.దీంతో ఈటీవీ షోలో మార్పులు తప్పవంటున్నారు ఆడియన్స్.కొత్త కొత్త ఐడియాస్ తో రావాల్సి ఉంది.జబర్దస్త్, ఢీ పై మరింత కాన్సంట్రేషన్ చేసి కొత్త కమెడియన్స్ ని తీసుకొని ఫార్మటు చేయాల్సిన అవసరం ఉంది.ఇలానే ఈ షోలు నడిస్తే కష్టమే.