తుమ్మల వర్సెస్ షర్మిల ఈక్వేషన్ సెట్ కాలేదా?

సుదీర్ఘకాలంగా షర్మిల( YS Sharmila ) పార్టీ విలీనం అంశం పెండింగ్ గ్ లోనే ఉండటం మరోవైపు ఎన్నికలు దగ్గర పడటంతో అసలు పాలేరు సీటుపై ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతుంది .తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తన చేరికను వ్యతిరేకిస్తున్నా కూడా కర్ణాటక ఛానల్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని( Congress ) కలిసిన షర్మిల కొన్ని అంశాలపై గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది.

 Who Will Get Paleru Seat Ys Sharmila Or Tummala Nageswar Rao Details, Paleru Se-TeluguStop.com

పాలేరు కచ్చితంగా షర్మిలకే కేటాయిస్తారని తెలంగాణ ఎన్నికలలో కీలక కాంపైనర్ గా షర్మిల ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటూ వార్తలు వినిపించాయి .అయితే ఆంధ్రాలో అధ్యక్షురాలి పదవి ఇచ్చిన పర్వాలేదు గాని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం షర్మిల జోక్యం సహించనని ఇప్పటికే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తేల్చి చెప్పేసిన దరిమిలా కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని పెండింగ్లో పెట్టింది.

Telugu Congress, Cwc, Khammam, Paleru Seat, Revanth Reddy, Tummalanageswar, Ys S

మరోవైపు ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల( Tummala Nageswar Rao ) పార్టీలోకి చేరడానికి సిద్ధమవడంతో ఇప్పుడు ఈక్వేషన్స్ మరింత కష్టంగా మారిపోయాయి.పాలేరు( Paleru ) ఎవరికి ఇవ్వాలి షర్మిలకా ? తుమ్మలకా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.అయితే కేంద్ర నాయకత్వం అండతో ప్రొసీడ్ అవుతున్న షర్మిలను ఆపే శక్తి లేదని రేవంత్కు లేదని షర్మిల దే పాలేరు అంటూ విశ్లేషణలు వినిపించాయి.మరోపక్క కాంగ్రెస్లో బలమైన శక్తిగా ఉన్న డీకే మద్దతు కూడా ఉండడంతో పాలేరు లో ఆమె పోటీ చేయడం లాంచనమే అంటూ వినిపించింది.

అయితే ఇప్పటికీ షర్మిల పార్టీ విలీనంపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అసలు తెర వెనక ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది.

Telugu Congress, Cwc, Khammam, Paleru Seat, Revanth Reddy, Tummalanageswar, Ys S

పాలేరు కాకపోయినా ఖమ్మంలో ( Khammam ) పోటీ చేయడానికి కూడా తుమ్మల సిద్ధంగానే ఉన్నారని ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి .దాంతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని సిడబ్ల్యుసి సమావేశాలు పూర్తి అయిన తర్వాత ఈ దిశగా ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా పాలేరు టికెట్టు వచ్చినప్పటికీ తనను అడుగడుగునా అడ్డుకుంటున్న రాష్ట్ర నాయకత్వంతో షర్మిల ఏ మేరకు సర్దుబాటు చేసుకోగలరు అన్నది పెద్ద ప్రశ్న.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ కూతురిగా ఆమెను అభిమానించే ప్రజలు నాయకులు ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యక్షంగా వ్యతిరేకించడంతో ఆమె ఏ మేరకు ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి.అయితే బలమైన ఛానల్ తో లాబీయింగ్ చేసుకోగలిగిన షర్మిల రాష్ట్ర నాయకత్వంతో కూడా సమన్వయం చేసుకోగలదని ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురిగా ఆమెకు ఆ సమర్దత్త ఉందని మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube