గర్భిణీ స్త్రీలు పాలలో పసుపు కలిపి తాగవచ్చా..? ఇలా తాగితే ఏమవుతుంది..?

గర్భధారణ సమయంలో పసుపు పాలు( Turmeric Milk ) తాగడం వలన తల్లి, బిడ్డకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.అలాగే అనేక ఔషధ గుణాల కారణంగా పసుపును చాలా సంవత్సరాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

 Benefits Of Turmeric Milk During Pregnancy,turmeric Milk,pregnant Woman, Pregna-TeluguStop.com

అయితే పసుపు రూట్ అండ్ ఇన్ఫఫ్లమేషన్ ప్రభావాలను కలిగి ఉంటుంది.అలాగే ఇందులో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఆయుర్వేద ఆరోగ్య గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పసుపును పాలలో కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడింది.అయితే గర్భిణీ స్త్రీలు( Pregnant Woman ) పిండం, అస్తిపంజర వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన కాల్షియాన్ని ఇది అందిస్తుంది.

Telugu Oxidant, Flu, Tips, Pregnancy, Pregnancy Tips, Pregnant, Turmeric, Turmer

అంతేకాకుండా గర్భధారణ సమయంలో పరిమిత పరిమాణంలో పసుపు తీసుకోవడం చాలా ఉత్తమమైనది.గర్భధారణ సమయంలో నీరు నిలుపుకోవడం, హార్మోన్లో మార్పుల వలన కీళ్ల నొప్పులు, పాదాల వాపులు వస్తాయి.అయితే ఇలాంటి సమయంలో పసుపు పాలను తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది.ఇక పసుపులో ఆంటీ ఇన్ఫ్లమేటరీ లాంటి లక్షణాలు ఉంటాయి.ఇవి జలుబు, ఫ్లూ నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.పసుపు పాలను తాగడం వలన జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి దూరమవుతాయి.

పసుపు యాంటీ ఆక్సిడెంట్( Anti Oxidant ) గా పని చేస్తుంది.అలాగే ఇది ఫ్రీ రాడికల్స్ ని తొలగించడానికి రోగునిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Telugu Oxidant, Flu, Tips, Pregnancy, Pregnancy Tips, Pregnant, Turmeric, Turmer

పసుపులోని ఆంటీ లక్షణాలు కొలెస్ట్రాల్( Cholestrol ) పెరగకుండా నిరోధిస్తాయి ఇది గర్భిణీ స్త్రీలు, శిశువులను ఎన్నో వ్యాధుల నుండి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది అయితే గర్భిణీ స్త్రీలు అధికంగా కూడా పసుపును తీసుకోకూడదు.పసుపును అధికంగా తీసుకోవడం వలన గర్భాశయంతో సహా మృదువైన కండరాల సంకొచానికి కారణం అవుతుంది.సంకోచాల కారణంగా ప్రసవ నొప్పి కూడా ప్రారంభం అవుతుంది.ఇది గర్భస్రావానికి దారి తీస్తుంది.

అలాగే గర్భం దాల్చిన తొమ్మిదవ నెలలో లేదా గర్భం దాల్చిన 37వ వారంలో పసుపును ఎక్కువగా తీసుకోకూడదు.గర్భిణీ స్త్రీలు పసుపు పరిమాణం పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

ఎందుకంటే అధిక మోతాదులో పసుపును తీసుకోవడం వల్ల పిండం, రుగ్మతలు లేదా పిండం అభివృద్ధిలో సమస్యలు ఏర్పడతాయి.అందుకే రోజుకు గర్భిణీ స్త్రీలు పసుపును ఒక గ్రామ్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు.

అందుకే పాలలో కూడా చిటికెడు పసుపుని మాత్రమే కలుపుకొని తాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube