ఈ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ రూ.71 లక్షలు.. అంత ధర ఎందుకంటే..!

ఫిన్నిష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్( Finnish electric motorcycle ) తయారీదారు వెర్జ్ మోటార్‌సైకిల్స్ ఒక సంచలన బైక్‌ను ప్రకటించింది.“మికా హకినెన్ సిగ్నేచర్ ఎడిషన్” పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది.ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించి కేవలం 100 యూనిట్లు మాత్రమే తయారుచేస్తారు.దీని ధరను 80,000 యూరోలు (సుమారు రూ.71.48 లక్షలు)గా కంపెనీ నిర్ణయించడం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.ఇంత ధర పెడితే ఒక మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు.మరి ఈ బైక్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 The Cost Of This Electric Bike Is Rs. 71 Lakhs Because Of That Price , Verge Mot-TeluguStop.com

వెర్జ్ మోటార్‌సైకిల్ TS ప్రో మోడల్( Verge Motorcycle TS Pro Model ) ఆధారంగా తయారయ్యింది.Mika Hakkinen ఎడిషన్ డార్క్ గ్రే, సిల్వర్ కలర్‌లతో డ్యూయల్-టోన్ ఫినిష్‌తో వస్తుంది.

ఈ పెయింట్ స్కీమ్ 1998-1999లో హక్కినెన్ విజయానికి కారణమైన మెక్‌లారెన్ ఫార్ములా 1 రేస్‌కార్లకు గౌరవార్థంగా రూపొందింది.

Telugu Finnish Legend, Run, Mikahakkinen, Vergemotorcycle-Latest News - Telugu

బైక్ సస్పెన్షన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.సీటు రెండు రకాల లెదర్‌తో తయారైంది.మికా హక్కినెన్ ఎడిషన్‌లో( Mika Hakkinen ed ) గీతలు పడకుండా ఒక సన్నని ఫిల్మ్ సిరామిక్ కోటింగ్ కూడా ఇచ్చారు.ఈ బైక్‌లో ఆఫర్ చేసిన హబ్లెస్ మోటార్ 136.78bhp పవర్, 1,000Nm టార్క్‌ ప్రొడ్యూస్‌తో అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తోంది.ఈ శక్తితో ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 మైళ్ల (96.5కిమీ/గం) వేగాన్ని అందుకోగలదు.మికా హక్కినెన్ సిగ్నేచర్ ఎడిషన్ మోటారు 20.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 563 కి.మీల రేంజ్‌ను ఇది అందిస్తుంది.బ్యాటరీ 25kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.బైక్‌ను 35 నిమిషాల్లో వేగంగా ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ అనుమతిస్తుంది.

Telugu Finnish Legend, Run, Mikahakkinen, Vergemotorcycle-Latest News - Telugu

బ్రేకింగ్‌ విషయంలోనూ ఈ బైక్ అన్నిటికంటే అడ్వాన్స్‌గా ఉంది.245కేజీల Mika Hakkinen ఎడిషన్‌లో బ్రెంబో 4.32 ఫోర్-పిస్టన్ కాలిపర్లు, ముందు భాగంలో రెండు 230mm గల్ఫర్ డిస్క్‌లు ఉన్నాయి.వెర్జ్ 4-పిస్టన్ రియర్ కాలిపర్లతో సింగిల్ 380mm గల్ఫర్ పెరిఫెరల్ డిస్క్‌తో రియర్ వీల్ బ్రేక్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube