ఈ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ రూ.71 లక్షలు.. అంత ధర ఎందుకంటే..!

ఫిన్నిష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్( Finnish Electric Motorcycle ) తయారీదారు వెర్జ్ మోటార్‌సైకిల్స్ ఒక సంచలన బైక్‌ను ప్రకటించింది.

"మికా హకినెన్ సిగ్నేచర్ ఎడిషన్" పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించి కేవలం 100 యూనిట్లు మాత్రమే తయారుచేస్తారు.దీని ధరను 80,000 యూరోలు (సుమారు రూ.

71.48 లక్షలు)గా కంపెనీ నిర్ణయించడం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఇంత ధర పెడితే ఒక మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు.మరి ఈ బైక్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెర్జ్ మోటార్‌సైకిల్ TS ప్రో మోడల్( Verge Motorcycle TS Pro Model ) ఆధారంగా తయారయ్యింది.

Mika Hakkinen ఎడిషన్ డార్క్ గ్రే, సిల్వర్ కలర్‌లతో డ్యూయల్-టోన్ ఫినిష్‌తో వస్తుంది.

ఈ పెయింట్ స్కీమ్ 1998-1999లో హక్కినెన్ విజయానికి కారణమైన మెక్‌లారెన్ ఫార్ములా 1 రేస్‌కార్లకు గౌరవార్థంగా రూపొందింది.

"""/" / బైక్ సస్పెన్షన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.సీటు రెండు రకాల లెదర్‌తో తయారైంది.

మికా హక్కినెన్ ఎడిషన్‌లో( Mika Hakkinen Ed ) గీతలు పడకుండా ఒక సన్నని ఫిల్మ్ సిరామిక్ కోటింగ్ కూడా ఇచ్చారు.

ఈ బైక్‌లో ఆఫర్ చేసిన హబ్లెస్ మోటార్ 136.78bhp పవర్, 1,000Nm టార్క్‌ ప్రొడ్యూస్‌తో అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తోంది.

ఈ శక్తితో ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 మైళ్ల (96.

5కిమీ/గం) వేగాన్ని అందుకోగలదు.మికా హక్కినెన్ సిగ్నేచర్ ఎడిషన్ మోటారు 20.

2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 563 కి.

మీల రేంజ్‌ను ఇది అందిస్తుంది.బ్యాటరీ 25kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

బైక్‌ను 35 నిమిషాల్లో వేగంగా ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ అనుమతిస్తుంది. """/" / బ్రేకింగ్‌ విషయంలోనూ ఈ బైక్ అన్నిటికంటే అడ్వాన్స్‌గా ఉంది.

245కేజీల Mika Hakkinen ఎడిషన్‌లో బ్రెంబో 4.32 ఫోర్-పిస్టన్ కాలిపర్లు, ముందు భాగంలో రెండు 230mm గల్ఫర్ డిస్క్‌లు ఉన్నాయి.

వెర్జ్ 4-పిస్టన్ రియర్ కాలిపర్లతో సింగిల్ 380mm గల్ఫర్ పెరిఫెరల్ డిస్క్‌తో రియర్ వీల్ బ్రేక్ ఇచ్చారు.

గ్రీన్‌కార్డులు, హెచ్-1బీ వీసా సంస్కరణలు.. జో బైడెన్ తీరుపై భారత సంతతి నేత అసహనం