తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీకి దూరంగా ఉండానన్నారని తెలుస్తోంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వనుందని సమాచారం.ఈ కారణంగానే భాస్కర్ రెడ్డి పోటీకి దూరంగా ఉండనున్నారు.
అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.నెక్ట్స్ ఎలక్షన్స్ లో బరిలో నిలిచేందుకు మోహిత్ రెడ్డికి ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నికల కమిటీలో చెవిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.మరోవైపు మోహిత్ రెడ్డికి టికెట్ ఖరారు అయిందంటూ అభిమానులు సందడి మొదలైంది.







