ప్రాచీన వైద్య విధానం నుంచి, నేటి మల్టిస్పెషాలిటి యుగం వరకు, వేపాకు, వేపచెట్టుకి ఉన్న విలువ పడిపోలేదు.వేపచెట్టులో ఉండే ప్రతీ కొమ్మ, రెమ్మ, కాయ .
అన్ని మనిషి జీవితానికి, ఈ భూమికి ఉపయోగపడేవే.ప్రకృతి మనకిచ్చిన గొప్పవరం వేప.ఆయుర్వేదంలోని చక్రసంహితలో వేపకి “సర్వరోగ నివారిణి” అనే కితాబిచ్చారు.ఇలాంటి వేప వలన లెక్కలేనన్ని లాభాలున్నాయి.
వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
* వేపాకులో యాంటిబ్యాక్టిరియల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలు ఉంటాయి.
ఇది ఎన్నోరకలా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
* వేప శరీరంలోకి చేరాక ఇన్సులిన్ లా పనిచేస్తుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెస్తుంది.
* నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా వేపాకు నమిలితే మంచిది.
చేదుగా అనిపిస్తే వేప, తేనె కలిపి జ్యూస్ చేసుకోని తాగవచ్చు.
* రక్తంలో ఏర్పడే టాక్సిన్స్ ని తొలగించి రక్తాన్ని శుద్ధిచేస్తుంది వేప.దాంతో ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు మన జోలికి రావు.
* వేపాకు పేస్ట్ తో జుట్టుని అందంగా చేసుకోవచ్చు.
అలాగే దంతాలను తెల్లగా, నిగనిగలాడేలా మార్చవచ్చు.
* వేపాకు మొటిమల మీద చాలా బలంగా పనిచేస్తుంది.
మొటిమలను మోసుకొచ్చే ప్రొపియోనిబ్యాక్టిరియమ్ అక్నెస్ తో వేపాకు సమర్థవంతంగా పోరాడుతుంది.
* వేపలో ఫైబర్ బాగా దొరుకుతుంది.
ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
* డ్రై స్కిన్ ఉన్నవారు వేపాకు పేస్ట్ ని రోజూ ముఖానికి పెట్టుకుంటే, మంట, దురద వంటి సమస్యలు దరిచేరవు.
* వేప అల్సర్స్ పై కూడా ప్రభావం చూపుతుంది.
* వేపలో ఫాట్టి ఆసిడ్స్ ఎక్కువ.
మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, గుంటలను పోగొట్టడానికి సహాయపడుతుంది వేపాకు.
* డాండ్రఫ్, ఇర్రిటేషన్ .ఇలా కురులకి సంబంధించిన ఏ సమస్య వెంబడించినా, వేపను ఆశ్రయించవచ్చు.