ప్రస్తుతం టీవీ షోలలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి( Kaun Banega Crorepati )’ షో గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఈ షో తాజాగా 16వ సీజన్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
అయితే., ఈ షోలో భాగంగా 22 సంవత్సరాలు గల కుర్రవాడు చంద్ర ప్రకాష్ ( Chander Parkash )సంచలనం సృష్టించాడు.
ఏకంగా కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి కోటి రూపాయలను సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా హ్యుందాయ్ కంపెనీ కారు కూడా కైవసం చేసుకున్నాడు.
అంతేకాకుండా ఈ సీజన్లో కోటి రూపాయలు గెలిచిన తొలి కంటెంట్ కావడం కూడా.ఇక కోటి రూపాయల ప్రశ్న తర్వాత అడిగిన చందాన్ ప్రకాష్ ఏడుకోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినా కూడా రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్విట్ అయ్యాడు.
దాంతో కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు.
ఇక ఈ షోకు బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్( Amitabh Bachchan ) వ్యాఖ్యాతగా చేస్తుండగా.ఆయన చంద్ర ప్రకాష్ కు కోటి రూపాయలకు సంబంధించిన ప్రశ్న విషయానికి వస్తే.‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం.
దాని రాజధాని కాదు కానీ.‘శాంతి నివాసం’ అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’ అని వ్యాఖ్యాత అమితాబ్ ప్రశ్న అడిగారు.
దీనికి ఎ.సోమాలియా, బి.ఒమన్, సి.టాంజానియా, డి.బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.ఇందులో భాగంగా ‘డబుల్ డిప్’ లైఫ్ లైన్ వినియోగించి ఆప్షన్ టాంజానియా ఎంచుకున్నాడు.
అదే సరైన సమాధానం అవ్వడంతో కోటి రూపాయల గెలుచుకున్నట్లు అమితాబచ్చన్ తెలియజేశారు.ఈ క్రమంలో అమితాబచ్చన్ సీట్లో నుంచి లేచి అతని ఆప్యాయంగా కౌగిలించుకొని అభినందనలు తెలియజేశాడు.
అంతేకాకుండా కోటి రూపాయలతో పాటు అతనికి ఒక కారు కూడా బహుమతి అందుకున్నాడు.ఈ 20 ఏళ్ల చంద్ర ప్రకాష్ స్వస్థలం విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్.
ప్రస్తుతం ఈ కుర్రవాడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.అలాగే తాను చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడని పేగులో కూడిక కారణంగా ఇప్పటికే 7 సార్లు సర్జరీ కూడా జరిగినట్లు ప్రకాష్ తెలియజేశాడు.
ఇక కోటి గెలిచాక జాక్ పాట్ 7 కోట్ల ప్రశ్నను అడిగారు.ఇక ప్రశ్న విషయానికి వస్తే.“1587లో ఉత్తర అమెరికా( North America )లో ఆంగ్ల తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?” దీనికి 4 ఎంపికలు ఇచ్చారు.ఎ) వర్జీనియా డేర్, బి) వర్జీనియా హాల్, సి) వర్జీనియా కాఫీ, డి) వర్జీనియా సింక్.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం- వర్జీనియా డేర్.ఇకపోతే., చంద్ర ప్రకాష్ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు.కాకపోతే., అతను ఖచ్చితంగా చెప్పలేదు.దీని కారణంగా అతను కోటి రూపాయలతో ఆడటం మానేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే చివరి ప్రశ్నకు గాను అమితాబ్ బచ్చన్ అతనిని సమాధానం ఎంచుకోమని అడిగినప్పుడు, అతను A ఎంపికను ఎంచుకున్నాడు.నిజానికి అది సరైన సమాధానం.
అయితే., మాత్రం చంద్ర ప్రకాష్ తనకు ఖచ్చితంగా తెలియదని.
అందుకే ఆట నుంచి తప్పుకున్నానని తెలిపాడు.