తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలి.లేకపోతే వారు చేయకూడని పనులు చేసి ప్రమాదాల్లో పడవచ్చు.
పిల్లలని వారు సీక్రెట్ గానే ఈ పనులు చేస్తారు.కానీ ఒక చిన్నారి మాత్రం అందరి ముందే బీరు తాగుతూ షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే, టెక్సాస్‌లోని(Texas) ఒక ఫుట్‌బాల్ స్టేడియంకు(football stadium) ఓ చిన్న పాప వచ్చింది.స్టేడియంలో జనాల మధ్యలో కూర్చున్న ఆ చిన్నారి ఒక బీరు బాటిల్ మూత తీసేసి అందులోని డ్రింక్ మూడుసార్లు గుటుక్కున మింగింది.
ఆమె తల్లి ఈ చిన్నారిని చూసిందా లేదా అనేది తెలియ రాలేదు.పక్కన కూర్చున్న ఆమె అన్నయ్య నీళ్లు తాగుతుండగా, ఆమె మాత్రం బీర్ తాగుతూ మిగతా వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అమెరికా దేశానికి చెందిన కోల్లన్ రగ్ ఈ వీడియోను సోషల్ మీడియా(Social media) ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆ చిన్న పాప బీర్ తాగుతున్న దృశ్యం కనిపిస్తోంది.ఈ పాపకు నాలుగేళ్ల వయసు ఉంటుంది.ఆమె మైకెలోబ్ అల్ట్రా (Micellobe Ultra)అనే బీర్‌ను వేగంగా తాగుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.టెక్సాస్ లాంగ్‌హార్న్స్ క్రీడా జట్టుకు ఆమె అభిమాని అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఫేస్‌కు తెల్లగా రంగు వేసుకుంది.బహుశా ఆ పాప చేతిలో బీర్ డబ్బా పట్టుకోమని ఆమె తల్లి అడిగి ఉంటుంది.
తల్లి తిరిగి తీసుకోవాలనుకునే లోపే ఆ పాప అంతా తాగేసిందని, మొదట ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి చెప్పాడు.
ఆ చిన్న పాప బీర్ తాగుతుండగా ఆమె తల్లి గమనించలేదని చాలా మంది నెటిజన్లు ఆమెను తప్పు పడుతున్నారు.‘పిల్ల బీర్ తాగుతుండగా ఆపకుండా వీడియో తీస్తున్న వాళ్లూ తప్పు చేశారు’ అని ఒకరు కామెంట్ చేశారు.ఇంతకు ముందూ ఈ పాప బీర్ తాగి ఉంటుందని మరొకరు అనుమానిస్తున్నారు.‘ఏ చిన్న పిల్లైనా బీర్ తాగితే వెంటనే ఉమ్మివేస్తారు కదా’ అని వారు అన్నారు.
బీర్ రుచి ఆ పాపకు ఎలా నచ్చింది అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.‘ఆ పాప కోకాకోలా (Coca Cola)తాగి ఉంటే బాగుండేది.మైకెలోబ్ అల్ట్రా అంటే నీళ్ళలా ఉంటుంది.
ఆమెకు ఏమీ కాదు’ అని ఒకరు వ్యంగ్యంగా అన్నారు.అమెరికాలో చాలా ఫుట్‌బాల్ స్టేడియాలలో మద్యం అమ్ముతారు.
ఈ ఆచారం 2015లో డారెల్ కె రాయల్-టెక్సాస్ మెమోరియల్ స్టేడియం నుంచి మొదలైంది.అయితే, టెక్సాస్ స్టేడియాలలో 21 ఏళ్లు పైబడిన వాళ్ళు మాత్రమే మద్యం కొనవచ్చు.