ఈ రెండు రెమెడీస్ ను పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

హెయిర్ ఫాల్( Hair fall ) అనేది మ‌న‌లో చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్య.అయితే జుట్టు రాలడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.

 Follow These Two Remedies To Get Rid Of Hair Fall! Hair Fall, Home Remedies, Lat-TeluguStop.com

అలాగే అందరిలోనూ హెయిర్ ఫాల్ ఒకే విధంగా ఉండదు.కొందరిలో జుట్టు చాలా తక్కువగా రాలితే.

‌.మరికొందరిలో హెవీ గా ఉంటుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు రెమెడీస్ ను తప్పకుండా పాటించండి.

Telugu Care, Care Tips, Fall, Pack, Healthy, Latest-Telugu Health

రెమెడీ-1:

రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.ఈ అల్లం తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.అల్లం జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Healthy, Latest-Telugu Health

రెమెడీ-2:

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఈ రెండు రెమెడీస్ ను తరచూ పాటించడం వల్ల చాలా లాభాలు పొందుతారు.ముఖ్యంగా జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు దూరం అవుతాయి.

జట్టు ఆరోగ్యంగా బలంగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube