మిస్ యు మై మ్యాన్... సంచలనం రేపుతున్న సమంత పోస్ట్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

 Samantha Latest Post Goes Viral About Varun Dhawan , Varun Dhawan, Samantha, Hon-TeluguStop.com

ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత త్వరలోనే హనీ బన్నీ ( Honey Bunny ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ప్రియాంక చోప్రా నటించిన సిటాడేల్ ( Citadel ) అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో హానీ బన్నీ అనే పేరుతో ఇండియన్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Telugu Citadel, Honey Bunny, Samantha, Samanthalatest, Varun Dhawan-Movie

ఇక ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా లండన్ లో ఈ సిరీస్ ప్రీమియర్ షో వేయడంతో సమంత ఈ షోలో పాల్గొన్నారు.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఈ ప్రీమియర్ షో కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె ఈ పోస్టుకు మిస్ యు మై మాన్ వరుణ్ ధావన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Telugu Citadel, Honey Bunny, Samantha, Samanthalatest, Varun Dhawan-Movie

ఇలా మిస్ యు మై మాన్ అంటూ ఈమె పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అయితే ఈ సిరీస్ లో సమంతకు జోడిగా వరుణ్ ధావన్ ( Varun Dhawan ) నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సిరీస్ ప్రీమియర్ షోలకు వరుణ్ ధావన్ లండన్ వెళ్లలేదు.అందుకే సమంత తనని మిస్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య( Nagachaitanya ) ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సమంత కొన్ని భేదాభిప్రాయాల కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు.

అయితే నాగచైతన్య మాత్రం రెండోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే శోభిత ( Sobitha ) తో ఈయన నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube