స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో అరుదైన ఘనత.. కల్కి మూవీ అక్కడ ప్రదర్శితం కానుందా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ఏ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ నటించి ఈ ఏడాది విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Star Hero Prabhas Kalki Movie Rare Record Details, Prabhas, Kalki Movie,kalki Mo-TeluguStop.com

ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది.అయితే తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరడం గమనార్హం.

Telugu Kalki Ad, Kalkibusan, Kalki, Prabhas, Prabhas Kalki-Movie

29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్( 29th Busan International Film Festival ) జరగనుండగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.ఈ ఏడాది జూన్ నెలలో విడుదలైన కల్కి మూవీ ఫ్యాన్స్ ను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చేసిందనే చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

Telugu Kalki Ad, Kalkibusan, Kalki, Prabhas, Prabhas Kalki-Movie

కల్కి మూవీ భవిష్యత్తులో రికార్డుల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.అక్టోబర్ నెల 2 నుంచి అక్టోబర్ 11 వరకు ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుండగా బీ.ఐ.ఎస్.ఎఫ్ లో ఉన్న అతిపెద్ద బహిరంగ థియేటర్ లో కల్కి మూవీని అక్టోబర్ 8, 9 తేదీలలో ప్రదర్శించనున్నారని సమాచారం అందుతోంది.కల్కి సీక్వెల్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

కల్కి మూవీ సీక్వెల్( Kalki Sequel ) ఒకింత భారీ రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి సీక్వెల్ కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్ అంటే కల్కి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube