సాధారణంగా చాలామంది స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఏ మాత్రం ఇష్టపడరనే సంగతి తెలిసిందే.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాత్రం తాజాగా ఒక సందర్భంలో తన ఫేవరెట్ హీరోయిన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి( Sridevi ) అని తారక్ తెలిపారు.జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హైదరాబాద్ కు వచ్చిన సమయంలో నేను మా ఇంటి భోజనం టేస్ట్ చూపించానని నేను ముంబై వచ్చిన సమయంలో జాన్వీ కపూర్ మాత్రం ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడ్ పంపించలేదని తారక్ పేర్కొన్నారు.తారక్ అలా కామెంట్స్ చేయడంతో జాన్వీ కపూర్ మాత్రం పగలబడి నవ్వేశారు.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ మా అమ్మ సౌత్ అయితే నాన్న నార్త్ అని అమ్మకు ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం కాగా నాన్నకు ఆలూ పరాటా ఇష్టమని బ్రేక్ ఫాస్ట్ విషయంలో మా మధ్య గొడవ జరిగేదని ఆమె పేర్కొన్నారు.జాన్వీ కపూర్ దేవర సినిమాపై( Devara Movie ) చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా హిట్ గా నిలిస్తే జాన్వీ ఆశలు నెరవేరినట్టేనని చెప్పవచ్చు.
దేవర సినిమాలో ఒక పాత్ర పేరు దేవర కాగా మరో పాత్ర పేరు వరద అని తెలుస్తోంది.దేవర సినిమాలో ట్విస్టులు మామూలుగా ఉండవని మైండ్ బ్లాంక్ అయ్యేలా ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.దేవర సినిమా ఇతర భాషలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.