తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు సైతం తమను తాము మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
యంగ్ హీరోలు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోకుండా సీనియర్ హీరోలు ఆయన వెంకటేష్,( Venkatesh ) చిరంజీవి,( Chiranjeevi ) నాగార్జున,( Nagarjuna ) బాలకృష్ణ( Balakrishna ) సైతం కష్టపడుతూ ముందుకు సాగుతుండటం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుడిలో భారీ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాయి.ఇక సీనియర్ హీరోలు అందరూ తమను తాము రిప్రజెంట్ చేసుకోవడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు అందరూ కూడా భారీ బడ్జెట్ తో సినిమాలను చేయడమే కాకుండా తమ సినిమాలే ఉన్నతంగా ఉండాలని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక చిరంజీవి విశ్వంభర( Vishwambhara ) సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోబోతున్నాడు.అలాగే బాలకృష్ణ బాబి తో చేయబోయే సినిమాలో దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా తెలుస్తుంది.ఇక నాగార్జున తన 100 వ సినిమా కోసం కొన్ని కథలను వింటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక విక్టరీ వెంకటేష్ ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇక ఈ సినిమా కూడా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఈ సీనియర్ హీరో వాళ్ళందరూ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…