బియాండ్ ఫెస్ట్ లో షార్క్ సీన్ చూసి షాకైన విదేశీయులు.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర.( Devara ) గత కొద్ది రోజులుగా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 Hollywood Audions Stunning Reactions After Watching Devara Movie Trailer In Beyo-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కో వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు తారక్.దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చింది.అలాగే అటు విదేశాల్లోనూ తారక్ సందడి చేస్తున్నారు.

తాజాగా లాస్ ఏంజిల్స్ ( Los Angeles )లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.అక్కడి స్టేజ్ పై తారక్ మాట్లాడుతూ దేవర సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్రమంలోనే బియాండ్ ఫెస్ట్ లో( Beyond Fest ) దేవర టీజర్, ట్రైలర్ ప్రదర్శించారు.అయితే అక్కడ దేవర ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు హాలీవుడ్ అడియన్స్.

ముఖ్యంగా ఈ సినిమాలోని షార్క్ సీన్ చూసి నోరెళ్లబెట్టారు.

ట్రైలర్ అయ్యాక అందరూ లేచి నిల్చొని చప్పట్లతో మారు మోగించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ట్రైలర్ చూసి అటు విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు.

ఇక సినిమా చూస్తే ఏమైపోతారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.ఈ రోజు సాయంత్రం బియాండ్ ఫెస్ట్ లో దేవర సినిమా ప్రీమియం వేయనున్నారు.

అటు తారక్ కూడా ఇదే ఫెస్ట్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడనున్నారు.మరి భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube