ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే.టీటీడీ ( TTD )శ్రీవారి లడ్డు కల్తీ వివాదంపై చర్చలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో బాధితులకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని అనేక డిమాండ్లు వస్తున్నాయి.ఈ క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్ , ప్రకాష్ రాజ్( Pawan Kalyan, Prakash Raj ) ల మధ్య ఈ వివాదం పై మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ విధితమే.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది.దయచేసి దర్యాప్తు చేయండి.నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోండి. అనవసర భయాలు కల్పించి.దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా మీరెందుకు చేస్తున్నారు.మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు.
జస్ట్ ఆస్కింగ్’ అని పేర్కొన్నారు.
అలాగే, ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో( Indrakiladri Durgagudi ) ఆలయ మెట్లను శుభ్రం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.ప్రకాశ్ రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నా.
విమర్శలకు ముందు ఏం జరిగిందో ముందు తెలుసుకోండి.సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ తెలిపారు.
దీనిపై ప్రకాశ్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు.‘పవన్ కళ్యాణ్ గారు.
నేను మీ ప్రెస్ మీట్ చూశాను.నేను చెప్పిందాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా.ఈ నెల 30 తర్వాత భారత్ వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా.
ఈలోగా మీకు వీలుంటే.నా ట్వీట్‌ను మళ్లీ చదవి అర్థం చేసుకోండి అని రాసుకొచ్చారు.
అనంతరం హీరో కార్తీ సారీ చెప్పిన దానికి స్పందిస్తూ.‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్’ అని మరో ట్వీట్ చేశారు.
ఇలా సోషల్ మీడియాలో మొదలైన వివాదం చివరకు ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరి.