ఆ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో దేవర మూవీ.. అనిరుధ్ చెప్పిన ఆసక్తికర విషయాలివే!

జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత హీరోగా నటించిన తాజా చిత్రం దేవర( Devara ).కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 An Avengers Or A Batman While Watching Devara Says Music Composer Anirudh, Aniru-TeluguStop.com

మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త అయినా సరే అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది.

Telugu Avengersbatman, Anirudh, Devara, Koratala Shiva-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ( Anirudh )స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు అనిరుద్ మాట్లాడుతూ.బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను.ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నాను.ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా.ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయవచ్చు.

ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాము.

Telugu Avengersbatman, Anirudh, Devara, Koratala Shiva-Movie

దేవర సినిమా చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు( Hollywood movies ) చూసిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమాలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది.ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి.

థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు.ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నాను.

కొరటాల శివ నన్ను హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా నాకు ఇష్టమే.అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో వారు కూడా అదేస్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాము అని చెప్పుకొచ్చారు అనిరుద్.ఈ మేరకు ఆయన చేసిన వాకిలి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube