కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ( NTR ) నటించిన దేవర సినిమా( Devara Movie ) అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి.
ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 27న మొదటి భాగం విడుదల కాగా రెండో భాగం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ దేవర సీక్వెల్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా యాంకర్ నుంచి సీక్వెల్ సినిమాకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నలకు కొరటాల శివ సమాధానం చెబుతూ దేవర 2 ( Devara 2 ) సినిమా వెంటనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకోసమే నటీనటులతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వారు కనుక కాల్ షీట్స్ ఇస్తే వెంటనే ఈ సినిమా ప్రారంభిస్తానని కొరటాల వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమాలో పాల్గొనే సెలబ్రిటీలకు వారి కాల్ షీట్స్ కనుక కుదరకపోతే ఈ సినిమా వాయిదా పడుతుందని ఆలోపు నేను మరో ఒక సినిమాని పూర్తి చేసి తిరిగి దేవర 2 పనులు ప్రారంభిస్తానని ఈ సందర్భంగా దేవర సీక్వెల్ గురించి కొరటాల క్లారిటీ ఇచ్చారు.అయితే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత తిరిగి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో బిజీ కానున్నారు.కనుక దేవర సీక్వెల్ వెంటనే షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.ఈ సినిమాతో పాటు మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్న నేపథ్యంలో దేవర 2 కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.