సాధారణంగా చాలా మందికి తలలో పేలు( Lice ) ఉంటాయి.చదువుకునే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పేలు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.
పేలు ఉంటే ఎప్పుడు కూడా చేతులు తలలోనే ఉంటాయి.పేలు కారణంగా తలలో దురద విపరీతంగా ఉంటుంది.
ఒక్కోసారి ఆ దురదకు జుట్టును కూడా పీకేసుకునేంత చిరాకు కలుగుతుంది.పైగా పేలు మన రక్తాన్ని పీల్చేస్తాయి.
తలలో పేలు ఉంటే రక్తహీనత( Anemia ) బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.

అందుకే పేలును వదిలించుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.పేలు ఎంత విపరీతంగా వేధిస్తున్న కూడా ఈ ఆయిల్ ను కనుక వాడితే వాటికి సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ పేలును వదిలించే ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి./br>

ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె, అర గ్లాసు ఆవనూనె( Mustard Oil ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ వేపాకు మరియు కొన్ని మర్రిచెట్టు వేరులు వేసి చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆపై ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న రెండు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఆయిల్ ను కనుక వాడితే తలలో పేలన్నీ చచ్చిపోతాయి. పేలు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు.మరియు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.