ఈ స్టార్లు చేసిన పాత సినిమా పేర్లు చెబితే మీరు అవాక్కవుతారు!

“అల్లు అర్జున్, డి జె టిల్లు, సందీప్ కిషన్, అడవి శేష్” గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ గా అవతరిస్తే, డి జె టిల్లు స్టార్ బాయ్ గా అలరిస్తున్నాడు.

 Tollywood Hero's Early Days Movies, Tollywood Hero, Allu Arjun, Siddu Jonnalagad-TeluguStop.com

ఇక సందీప్ కిషన్ వైవిధ్య భరితమైన పాత్రలను చేసుకుంటూ పోతే, అడవి శేష్ చాలా అరుదైన సినిమాలను ఎంచుకుంటూ, తనదైన మార్క్ ప్రదర్శిస్తున్నాడు.అయితే ఈ హీరోలు నిన్న మొన్నటి సినిమా పేరు చెబితే అందరూ చెప్పేస్తారు కానీ, వీరి పాత సినిమా పేర్లను మీకు చెబితే ముక్కు మీద వేలేసుంటారు మరి!.

ఇక్కడ మొదటగా “అల్లు అర్జున్” గురించి మాట్లాడుకుంటే… “విజేత, స్వాతి ముత్యం, డాడీ”( Vijetha , Swathi muthyam , daddy ) సినిమాలు మీకు గుర్తుందా? ఈ మూడు సినిమాలలో ఈ ఐకాన్ స్టార్ నటించి మెప్పించాడు.డాడీ సినిమాలో ఓ స్టేజి పై డాన్స్ ఇరగదీసాడు గుర్తుందా? అతడే అల్లు అర్జున్.ఇక విజేత, స్వాతి ముత్యం సినిమాలలో నటించాడు కానీ, అప్పటికి చాలా చిన్నవాడు కాబట్టి ఎవ్వరూ గుర్తు పట్టలేకపోవచ్చు.

“డి జె టిల్లు” సినిమా హీరో “సిద్ధు జొన్నలగడ్డ”( Siddu jonnalagadda ) గురించి నేటి తరానికి చెప్పాల్సిన పనిలేదు.సిద్ధు అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు! ఇక మన హీరో సిద్ధు “జోష్, ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు”( Josh, Orange, Bhimili Kabaddi jattu ) సినిమాలలో నటించిన ఈ టిల్లు మామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.ఆయా సినిమాలలో పిల్ల బచ్చ రోల్స్ చేసాడు.

కానీ ఇపుడు డి జె టిల్లు సిరీస్ తో జనాలను అలరిస్తున్నాడు.

Telugu Adivasi Shesh, Allu Arjun, Daddy, Panja, Sandeep Kishan, Swathi Muthyam,

ఇక “సందీప్ కిషన్”( Sandeep Kishan ) గురించి మాట్లాడుకుంటే సందీప్ “ప్రస్థానం” అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు.ఈ సినిమాలో విలన్ ఛాయలు ఉన్న రోల్ పోషించాడు సందీప్.ఈ సినిమాకి మంచి గుర్తింపు కూడా వచ్చింది.

ఆ తరువాత కాలంలో హీరోగా నిలదొక్కుకున్నాడు.ఈ క్రమంలో తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన సత్తా చాటుతున్నాడు.

Telugu Adivasi Shesh, Allu Arjun, Daddy, Panja, Sandeep Kishan, Swathi Muthyam,

చివరగా “అడవి శేష్”( Adivasi Shesh )గురించి ఇక్కడ మాట్లాడుకుంటే… శేష్ ఎలాంటి నటుడో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.క్షణం, గూఢచారి సినిమాలతో మంచి హీరోగా మారిన అడవి శేష్ విలన్ గా నటించాడని మీకు గుర్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా( Panja ) అనే సినిమాలో అడవి శేష్ ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ చేసి క్రిటిక్స్ నుండి మెప్పులు పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube