కరోనా మహమ్మారి తర్వాత థియేటర్ల వద్ద మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది.ఇటీవలే అఖండ,పుష్ప, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలు ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి.
తాజాగా విడుదలైన ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.ఇప్పుడు ఉన్న ఊపు కనుక కంటిన్యూ అయితే జనవరి 7న విడుదల అయ్యే ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే అది మూడునాళ్ళ ముచ్చట గానే మిగులుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రజలందరినీ ఒనికించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న క్రమంలోనే, ఒమిక్రాన్ వైరస్ మరొకవైపు దేశాన్ని వణికిస్తోంది.
ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది.దేశంలో రోజురోజుకీ ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
దీంతో ఇప్పటికే పలు జిల్లాలో ఒమిక్రాన్ ఆంక్షలు కూడా విధించారు.ఇప్పటికే పలు ప్రదేశాలలో రాత్రి సమయంలో కర్ఫ్యూను కూడా విధించారు.
దీంతో రాబోయే సినిమాలు రిలీజ్ అయ్యేటప్పటికీ థియేటర్ లు ఓపెన్ లో ఉంటాయా లేదా అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం విడుదల తేదీని మరొకసారి వాయిదా వేసేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఎందుకంటే తెలుగు హిందీలోనే ఈ సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయి.ఇలాంటి సమయంలో హిందీలో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో అని తెలుసుకోవడం వల్ల మరొకసారి కలెక్షన్లతో సినీ ఇండస్ట్రీకి ఊహించని దెబ్బ పడనుంది.మరి జనవరి 7 నాటికి పరిస్థితులు చక్కబడతాయా? లేక అంతకు రెండింతలు పరిస్థితులు దారుణంగా మారుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే? ఇక జనవరిలో ఆర్ ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్నాయి.మరి మహారాష్ట్రతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో నెట్ కర్ఫ్యూ విధించారు.
ఒకవేళ ఇదే గనుక కంటిన్యూ అయితే ఈ రెండు సినిమాలు విడుదల అవ్వడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.