ఈమద్య కాలంలో టిక్‌టాక్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రపంచ వ్యాప్తంగా కూడా టిక్‌టాక్ యూజర్ల సంఖ్య రోజు రోజుకు లక్షల్లో పెరుగుతూనే ఉన్నారు.
ఇండియాలో టిక్‌టాక్ యూజర్ల సంఖ్య భారీగా పెరింగింది.టిక్‌టాక్ వల్ల ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నారంటూ ప్రశంసలు కురుస్తున్నా, 100లో 95 శాతం మంది టిక్‌టాక్ వల్ల చాలా టైం వృదా చేయడంతో పాటు, తమ పనిని సరిగా చేయలేక పోతున్నారు.
ఇక టిక్‌టాక్ వల్ల ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం.

టిక్‌టాక్‌లో మిలియన్ వ్యూస్, లక్షల్లో లైక్స్ కోసం యువత ఏం చేసేందుకు అయినా సిద్దం అవుతోంది.దేశంలో పలు సందర్బాల్లో పలు సంఘటనలు జరిగింది.పదుల సంఖ్యలో టిక్‌టాక్ వల్ల మృతి చెందినట్లుగా కూడా మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన సోనిక కేతావత్ గురించి చర్చ జరుగుతోంది.సోనిక మన తెలుగు వారికి ఏ టిక్‌టాక్ ద్వారా అయితే బాగా పరిచయం అయ్యిందో అదే టిక్‌టాక్ వల్ల ప్రాణాలు వదిలింది.
కొన్ని రోజుల క్రితం విజయవాడ నుండి హైదరాబాద్‌కు డ్యూక్ బైక్‌పై వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది.ఆ బైక్‌ను సోనిక డ్రైవ్ చేస్తోంది.సాదారణ బైక్‌లను అమ్మాయిలు నడపడం కష్టంగా ఉంటుంది.అలాంటిది డ్యూక్ బైక్‌ను ఆమె నడిపేందుకు సిద్దం అయ్యింది.

సరే బండి డ్రైవ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండకుండా అంత హెవీ బండిని డ్రైవ్ చేస్తున్న ఆమె సరదాగా టిక్ టాక్ చేయలని ఫోన్ తీసింది.ఆ సమయంలోనే బండి అదుపు తప్పింది.సోనికతో పాటు ఆమె ఫ్రెండ్ రఫీ షేక్ కూడా బండిపై ఉన్నాడు.ఇద్దరు కూడా కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి.విజయవాడ, హైదరాబాద్ హైవేపై ఉండే కేతెపల్లి కొర్లపాడ్ టోల్ గేట్‌కు సమీపంలో అంటే సూర్యపేటకు 15 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్‌కు గురయ్యారు.వెంటే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం జరిగింది.
ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకుని లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు య్యాయి.

హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఇద్దరు కూడా సేవ్ అవుతారని స్నేహితులు మరియు ఇతరులు అనుకున్నారు.కాని సోనిక తలకు తలిగిన గాయంకు ఇన్ఫెక్షన్ రావడంతో తాజాగా మృతి చెందింది.రఫీ కోసం స్నేహితులు ఫండ్ రైజింగ్ చేయడంతో పాటు, అతడి వైధ్య ఖర్చులు కూడా స్నేహితులు భరించారు.
సోనిక చనిపోవడంతో ఆమెను టిక్‌టాక్‌లో ఫాలో అయ్యే వారు తీవ్ర దుఖంలో మునిగి పోయారు.ఆమె కోసం ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు.సోషల్ మీడియాలో స్టార్‌గా పేరు దక్కించుకున్న దీప్తి సునయనతో పాటు ఎంతో మంది సోనిక మరణంకు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి ఆర్‌ఐపీ చెప్పారు.

మరో వైపు తన కూతురు మరణంకు కారణంగా రఫీ మరియు ఆయన స్నేహితులు అంటూ సోనిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కూతురు మరణంను జీర్ణించుకోలేక పోతున్న ఆ తండ్రి తీవ్ర దుఖంలో మునిగి పోయాడు.యువత సరదాగా టిక్‌టాక్ చేస్తే పర్వాలేదు కాని, మరీ ప్రాణాలకు తెచ్చుకుంటుంది.
టిక్‌టాక్ కోసం సాహసాలు చేయాలనుకునే వారికి ఇకపై అయినా సోనిక సంఘటన గుర్తు రావాలని కోరుకుందాం.మరోసారి ఎక్కడ ఇలాంటి దారుణం జరగకూడదంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.
టిక్‌టాక్ వల్ల ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు కనుకే బ్యాన్ చేయాలనే డిమాండ్ వస్తుంది.ఇండియాలో ఈ దెబ్బతో అయినా టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని కోరుకుందాం.