తెలంగాణలో రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ అధికారం పై అనేక సమీకరణాలు మారుతున్నట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా అధికార బారాసా( BRS PARTY ) నుంచి కాంగ్రెస్( Congress ) వైపు గాలి మల్లుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికార పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలు ఇస్తున్న హామీలు రాజకీయ వాతావరణాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఇప్పుడు తెలంగాణలో కచ్చితంగా హంగ్ వచ్చి తీరుతుంది అని సర్వేలు ఘోషిస్తున్నాయి.లేటెస్ట్ గా వచ్చిన ఇండియా టుడే ఒపీనియన్ పోల్ లో కూడా 54 స్థానాలకు కాంగ్రెస్ పరిమితమవుతుందని 49 స్థానాలు టిఆర్ఎస్ కు 8 స్థానాలు బిజెపి కు ఇతరులు 8 స్థానాలు గెలుచుకుంటారంటూ ఇండియా టుడే అంచనా వేసింది.
తద్వారా అధికారానికి అన్ని పార్టీలు కొద్ది దూరంలో ఆగిపోతాయని ఈ సర్వే అంచనా వేసింది.

దీనికి కారణం అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుటం, లోటుపాట్లను సవరించుకుంటూ సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేస్తుండడం.ఇప్పుడు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని వాతావరణం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.అయితే చాలాకాలం నుండీ అధికార బారాస కు సహజమిత్రుడుగా కొనసాగుతున్న ఎంఐఎం ను కలుపుకున్నా కూడా అధికారంలోకి రావడం కష్టమే అన్న వాతావరణం ఉండడం బారాస కు మింగుడు పడదనే చెప్పవచ్చు.
అయితే భాజపా తో కూడా అధికార పార్టీకి లోపాయి కారి ఒప్పందాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న దరిమిలా ఆ పార్టీ మద్దతు కూడా తీసుకుంటే బారతీయ రాష్ట్ర సమితి మరోసారి గద్దే ఎక్కవచ్చు .

కానీ బిజెపి- ఎంఐఎం లు దీర్ఘకాల శత్రువులుగా కొనసాగుతున్నందున ఈ రెండు పార్టీలతో ఒకే సమయంలో పొత్తు పెట్టుకోవడం బి ఆర్ఎస్ కు కుదరకపోవచ్చు.అలాంటప్పుడు మజ్లిస్ కనుక కాంగ్రెస్ కు( Congress PARTY ) మద్దతు ఇస్తే ఏకపక్షంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.అయితే దీర్ఘకాలంగా కేసీఆర్ తో స్నేహం నెరుపుతున్న అసుదుద్దీన్( Asaduddin ) ఈ పరిణామాలకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారుతుంది .అలాంటి పరిస్థితి వస్తే కనుక కచ్చితం గా కొనుగోళ్లు అమ్మకాలకు తెర లేస్తుంది .అప్పుడు కర్ణాటక తరహా రాజకీయాలకు తెలంగాణ కూడా కేంద్రం గా మారుతుంది .మరి ప్రచారంలో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచినందున చివరి వరకూ ఎవరు పట్టును నిలుపుకుంటారో ఆ పార్టీ ఒక అడుగు ముందుకు వేసే అవకాశం కనిపిస్తుంది.