పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్.ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అయింది.
అయితే బారి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది అన్న టాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తుంది .వాస్తవానికి రామాయణం అంటే
ఒక ఎమోషన్.

ఆదిపురుష్ లో చూపించిన అరణ్య, యుద్ధకాండల వరకు చూసుకున్నా సీతాపహరణం, జటాయువు మరణం, అలాగే శబరి భక్తి, సీతావియోగంతో రాముడి భావోద్వేగం, అశోకవనంలో సీత స్థితి ఇలా చెప్పుకుంటూ పోతే మనసుని పిండే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి .అయితే ఓం రౌత్( Om Rauth ) తెరకెక్కించిన ఆదిపురుష్ లో అలాంటి కంట తడి పెట్టించే సన్నివేశం ఒక్కడి కూడా లేదని అంటున్నారు.రావణ, విభీషణ, ఇంద్రజిత్ ల గెటప్ లు అసలు సెట్ కాలేదని అంటున్నారు .ఒక సన్నివేశంలో రావణుడు కొండచిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ కనిపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి,ఇక ఆదిపురుష్ నిం చూసిన తెలుగు ఆడియెన్స్ బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం( Sri Rama Rajyam ) చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు .రాముడంటే ఎలా ఉండాలో అలానే బాలకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన తీరుపై ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి .అప్పట్లో శ్రీరామరాజ్యం చిత్రాన్ని పెద్దగా ఆడియెన్స్ ఆదరించలేదు .అయితే ఇప్పుడు ఆదిపురుష్ వల్ల బాపు తెరకెక్కించిన రామాయణం విలువేంటో తెలిసిందని అంటున్నారు.

రాముడిగా బాలకృష్ణ ఒదిగిపోయాడని, లక్ష్మణుడిగా శ్రీకాంత్ సెట్ అయ్యాడని, సీతగా నయనతార అద్భుతంగా నటించిందని అంటున్నారు.దీంతోపాటు ఎన్టీఆర్ నటించిన లవకుశ, జూ ఎన్టీఆర్ బాల రామాయణం లు కూడా ఇప్పుడు ట్రేండింగ్ లోకి వచ్చాయి , ఇప్పుడు ఆయా సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు.ఇక ఆదిపురుష్ పై విమర్శలు ఎన్ని వచ్చినా,తొలి రోజు మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది .భారీ ఓపెనింగ్స్ వచ్చాయి .యూఎస్‌లోనూ ఇప్పటికే ఒక మిలియన్ దాటింది.మొత్తానికి ఫస్డ్ డే ఆదిపురుష్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.ఇక ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ ద్వారా250కోట్లు రాబట్టుకుంది.
తెలుగుతోపాటు సౌత్‌లో థియేట్రికల్ రైట్స్ 185కోట్లకి అమ్ముడు పోయింది.నార్త్, ఓవర్సీస్‌లో టీమ్ సొంతంగా రిలీజ్ చేసింది.
ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.ఈ నేపథ్యంలో అక్కడ కలెక్షన్స్ పెరగొచ్చు .సినిమా ఫలితంపై ఎలాంటి టాక్ వచ్చినా .నిర్మాతలకు ఎలాంటి నష్టం లేదు .అలాగే భారీ ఓపెనింగ్స్ .వీకెండ్ కలెక్షన్స్ ,అలాగే ప్రభాస్ ని రాముడిగా ధియేటర్ లో చూడాలని కొందరు అనుకోవడం వంటి కారణాలతో ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ రాబట్టి .డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా నష్టాలు లేకుండా చేయొచ్చు అని మాత్రం చెప్పవచ్చు
.