ఆదిపురుష్ ని బాలయ్య సినిమాతో పోల్చుతున్న నెటిజన్స్…

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్.

ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అయింది.అయితే బారి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది అన్న టాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తుంది .

వాస్తవానికి రామాయణం అంటే ఒక ఎమోషన్. """/" / ఆదిపురుష్ లో చూపించిన అరణ్య, యుద్ధకాండల వరకు చూసుకున్నా సీతాపహరణం, జటాయువు మరణం, అలాగే శబరి భక్తి, సీతావియోగంతో రాముడి భావోద్వేగం, అశోకవనంలో సీత స్థితి ఇలా చెప్పుకుంటూ పోతే మనసుని పిండే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి .

అయితే ఓం రౌత్( Om Rauth ) తెరకెక్కించిన ఆదిపురుష్ లో అలాంటి కంట తడి పెట్టించే సన్నివేశం ఒక్కడి కూడా లేదని అంటున్నారు.

రావణ, విభీషణ, ఇంద్రజిత్ ల గెటప్ లు అసలు సెట్ కాలేదని అంటున్నారు .

ఒక సన్నివేశంలో రావణుడు కొండచిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ కనిపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి,ఇక ఆదిపురుష్ నిం చూసిన తెలుగు ఆడియెన్స్ బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం( Sri Rama Rajyam ) చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు .

రాముడంటే ఎలా ఉండాలో అలానే బాలకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన తీరుపై ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి .

అప్పట్లో శ్రీరామరాజ్యం చిత్రాన్ని పెద్దగా ఆడియెన్స్ ఆదరించలేదు .అయితే ఇప్పుడు ఆదిపురుష్‌ వల్ల బాపు తెరకెక్కించిన రామాయణం విలువేంటో తెలిసిందని అంటున్నారు.

"""/" / రాముడిగా బాలకృష్ణ ఒదిగిపోయాడని, లక్ష్మణుడిగా శ్రీకాంత్‌ సెట్‌ అయ్యాడని, సీతగా నయనతార అద్భుతంగా నటించిందని అంటున్నారు.

దీంతోపాటు ఎన్టీఆర్‌ నటించిన లవకుశ, జూ ఎన్టీఆర్‌ బాల రామాయణం లు కూడా ఇప్పుడు ట్రేండింగ్ లోకి వచ్చాయి , ఇప్పుడు ఆయా సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు.

ఇక ఆదిపురుష్‌ పై విమర్శలు ఎన్ని వచ్చినా,తొలి రోజు మాత్రం రికార్డులు క్రియేట్‌ చేసింది .

భారీ ఓపెనింగ్స్ వచ్చాయి .యూఎస్‌లోనూ ఇప్పటికే ఒక మిలియన్‌ దాటింది.

మొత్తానికి ఫస్డ్ డే ఆదిపురుష్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు.

ఇక ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ, డిజిటల్‌ ద్వారా250కోట్లు రాబట్టుకుంది.

తెలుగుతోపాటు సౌత్‌లో థియేట్రికల్‌ రైట్స్ 185కోట్లకి అమ్ముడు పోయింది.నార్త్, ఓవర్సీస్‌లో టీమ్‌ సొంతంగా రిలీజ్‌ చేసింది.

ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.ఈ నేపథ్యంలో అక్కడ కలెక్షన్స్ పెరగొచ్చు .

సినిమా ఫలితంపై ఎలాంటి టాక్ వచ్చినా .నిర్మాతలకు ఎలాంటి నష్టం లేదు .

అలాగే భారీ ఓపెనింగ్స్ .వీకెండ్ కలెక్షన్స్ ,అలాగే ప్రభాస్ ని రాముడిగా ధియేటర్ లో చూడాలని కొందరు అనుకోవడం వంటి కారణాలతో ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ రాబట్టి .

డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా నష్టాలు లేకుండా చేయొచ్చు అని మాత్రం చెప్పవచ్చు.