ఈమధ్య పాపం పాకిస్తాన్ టైం అస్సలు బాగోలేదు.ఈ పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి అయినప్పటినుండి పాకిస్తాన్ కు దాపురించింది.
అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడం ఒక ఎత్తు కాగా మరోపక్క నవ్వుల పాలవ్వతుండడంతో దాని పరువంతాపోతుంది.ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి సినిమా స్టైల్ లో చెప్పాలంటే ఇంతకంటే ఇంకేంత దిగజారుతావని అన్నుకున్న ప్రతిసారి మరింత దిగజారుతూ బఫూన్ అవుతూ అందరినీ చక్కగా నవ్విస్తుంది.
తాజాగా పాకిస్తాన్ మరోమారు అందర్నీ పగలబడి నవ్వేలా చేసింది.
ఇంతకీ విషయం ఏంటంటే పాకిస్తాన్,జింబాబ్వే మధ్య వన్డే సీరీస్ ఈ గురువారం మొదలైంది.
ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హేరిస్ సోహైల్, ఇమామ్ ఉల్ హక్ ఇద్దరు ఒకే గ్రీస్ వైపు పోటీపడి పరిగెత్తి మరి రనౌట్ అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.చూసినవారంతా పకపక నవ్వేస్తూ తెగ షేర్ లు చేస్తున్నారు.మరి ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.